Mon. Jul 8th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, 21 జూన్, 2024: ట్రాయ్ (TRAI) విడుదల చేసిన తాజా టెలికాం చందాదారుల గణాంకాల ప్రకారం, రిలయన్స్ జియో లో ఈ ఏడాది ఏప్రిల్ నెలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కలిపి 1.56 లక్షలకు పైగా కస్టమర్లు కొత్తగా వచ్చి చేరారు.

ట్రాయ్ గణాంకాల ప్రకారం ఏప్రిల్ నెలలో జియో అత్యధికంగా 1,56,296 మంది మొబైల్ చందాదారులను చేర్చుకుంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో జియో కస్టమర్ల సంఖ్య ఏప్రిల్ నెలాఖరి నాటికి 3.29 కోట్లకు చేరుకుంది.

ఇదే నెలలో ఎయిర్టెల్ లో 55 వేల మంది కొత్త మొబైల్ చందాదారులు చేరారు. మరోవైపు ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ లో భారీగా 2.57 లక్షల మంది కస్టమర్లను కోల్పోయింది. వోడాఐడియా కూడా 23,456 మంది కస్టమర్లను కోల్పోయింది.

ఏప్రిల్ నెలలో దేశవ్యాప్తంగా కూడా జియో తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. జియో లో 26.8 లక్షల మంది కొత్త చందాదారులు చేరారు. ఈ గణాంకాల ప్రకారం ఏప్రిల్ 2024 నాటికి దేశంలో మొత్తం జియో మొబైల్ కస్టమర్ల సంఖ్య 47.24 కోట్లకు చేరుకుంది.

7.52 లక్షల కొత్త కస్టమర్లు, 26.75 కోట్ల మొత్తం కస్టమర్లతో ఎయిర్టెల్ తర్వాత స్థానంలో ఉంది. దేశీయంగా మొత్తం టెలికాం యూజర్ల సంఖ్య ఏప్రిల్ నాటికి 120 కోట్లు దాటడం విశేషం.

Also read :Premier Energies Limited has been recognized as Great Place to Work for third consecutive year and Best in Industry

Also read : Today World Music Day 2024