365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, 21 జూన్, 2024: భారతదేశ టైర్ల తయారీ దిగ్గజం, ట్రక్ బస్ రేడియల్ టైర్ల తయారీలో అగ్రగామి, జేకే టైర్ & ఇండస్ట్రీస్ సంస్థ మారుతున్న రవాణా రంగ అవసరాలకు అనుగుణంగా రూపొందించిన అధునాతన టైర్ల శ్రేణిని నేడు ఆవిష్కరించింది.

జెట్‌వే జేయూఎం ఎక్స్‌ఎం, జెట్‌వే జేయూసీ ఎక్స్‌ఎం, జెట్‌స్టీల్ జేడీసీ ఎక్స్‌డీ, ఎలక్ట్రిక్ బస్సుల కోసం విప్లవాత్మకమైన జెట్‌వే జేయూఎక్స్‌ఈ అనే నాలుగు కొత్త వేరియంట్లతో తమ ట్రక్ & బస్ రేడియల్ శ్రేణిని మరింత పటిష్టం చేసుకోవాలని జేకే టైర్ భావిస్తోంది.
పర్యావరణ పరిరక్షణపరంగా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ, అత్యుత్తమ పనితీరు, ఆర్థిక ప్రయోజనాల మేళవింపుతో అధునాతనమైన, అత్యధిక సామర్ధ్యంతో పనిచేసే సొల్యూషన్స్‌ను అందించాలన్న జేకే టైర్ నిబద్ధతకు ప్రోడక్టు పోర్ట్‌ఫోలియో విస్తరణ నిదర్శనంగా నిలుస్తుంది.
పర్యావరణహిత మొబిలిటీ సొల్యూషన్స్‌ను అందించాలన్న సంస్థ నిబద్ధతకు, అలాగే జేకే టైర్‌కు ఈ కొత్త టైర్లు ఒక కీలక మైలురాయిగా నిలుస్తాయి. పనితీరును, నిర్వహణ సామర్థ్యాలను, సస్టెయినబిలిటీని మెరుగుపరుస్తూ, ఖర్చులను ఆదా చేసే టైర్లను అందించడం ద్వారా భారతదేశపు రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులకు తెచ్చేందుకు సారథ్యం వహించడాన్ని జేకే టైర్ కొనసాగిస్తోంది.
“ఈ కేటగిరీలో అగ్రగామిగా ఉన్న మాకు ఈ సెగ్మెంట్‌పై అపార అవగాహన ఉంది. అధునాతన సాంకేతికతతో సస్టెయినబుల్ సొల్యూషన్స్‌ను ఆవిష్కరించడమనేది మా బాధ్యతని మేము భావిస్తున్నాం.

అత్యుత్తమ పనితీరు గల, ఆర్థికంగా లాభసాటైన, పర్యావరణహితమైన సొల్యూషన్స్‌ను అందించాలన్న మా నిబద్ధతకు ఈ తాజా ఉత్పత్తులు నిదర్శనంగా నిలుస్తాయి.
సురక్షితమైన ప్రయాణాలకు విశ్వసనీయమైన నేస్తంగా ఫ్లీట్ ఆపరేటర్లకు ఈ టైర్లు తోడ్పడగలవని మేము విశ్వసిస్తున్నాం ” అని ఉత్పత్తుల ఆవిష్కరణ సందర్భంగా జేకే టైర్ & ఇండస్ట్రీస్ లిమిటెడ్ ప్రెసిడెంట్ (ఇండియా) అనుజ్ కథూరియా తెలిపారు.
మైసూరులోని జేకే టైర్ అత్యాధునిక ఆర్&డీ సెంటర్, అధునాతన తయారీ ప్రక్రియలు, ఈ ఉత్పత్తులను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించాయి. నాణ్యత, పనితీరుకు సంబంధించి అత్యుత్తమ ప్రమాణాలతో ఉండేలా ఈ నాలుగు టైర్లు వివిధ పరిస్థితుల్లో విస్తృతంగా పరీక్షించబడ్డాయి.
జెట్‌వే జేయూఎం ఎక్స్‌ఎం:

జెట్‌వే జేయూఎం ఎక్స్‌ఎం 4-స్టార్ రేటింగ్ మరియు 4.9 KN/n RRc వేల్యూ కలిగి ఉంది. ఈ విభాగంలో అత్యధికంగా ఇంధనాన్ని ఆదా చేయగలిగే సామర్థ్యాలు దీనికి ఉన్నాయి. ఇంధనాన్ని ఆదా చేయడం, వ్యయాలను తగ్గించడంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పేలా ప్రత్యేకంగా బస్సులు, ట్రక్కుల కోసం ఈ కొత్త తరం ట్యూబ్‌లెస్ టైర్లు డిజైన్ చేయబడ్డాయి.
సాధారణంగా భారత్‌లో ట్రాన్స్‌పోర్టర్ల నిర్వహణ వ్యయంలో దాదాపు 50% వాటా ఇంధన వ్యయాలదే ఉంటుంది. గణనీయంగా ఇంధనాన్ని ఆదా చేయడం వల్ల అధిక వ్యయాల సమస్య పరిష్కారానికి ఇది కొంత తోడ్పడగలదు. అలాగే, ఇంధన వినియోగం తగ్గడమనేది కర్బన ఉద్గారాలు కూడా గణనీయంగా తగ్గేందుకు సహాయపడగలదు. తద్వారా రవాణా పరిశ్రమకు సుస్థిరమైన, ఆర్థికంగా లాభసాటైన పరిష్కారమార్గం లభించినట్లవుతుంది.
జెట్‌వే జేయూసీ ఎక్స్‌ఎం, జెట్‌స్టీల్ జేడీసీ ఎక్స్‌డీ:
భారత్‌లో భారీ స్థాయిలో మౌలిక సదుపాయాల అభివృద్ధి జరుగుతున్న నేపథ్యంలో కంపెనీ తమ అధునాతన ఎక్స్-సిరీస్ ప్రోడక్టుల శ్రేణి అయిన జెట్‌వే జేయూసీ ఎక్స్‌ఎం,జెట్‌స్టీల్ జేడీసీ ఎక్స్‌డీ టైర్లను ప్రవేశపెట్టింది. ప్రస్తుత డిమాండ్‌కి అనుగుణంగా ఇవి తీర్చిదిద్దబడ్డాయి. ఈ రెండు టైర్లు మెరుగైన సామర్థ్యం, మన్నిక,పనితీరును కలిగి ఉంటాయి.
చెప్పుకోతగ్గ స్థాయిలో 10% అధిక జీవిత కాలం ఉండే జేయూసీ ఎక్స్‌ఎం ప్రత్యేకంగా టిప్పర్లు, ట్రైలర్ల కోసం అభివృద్ధి చేసింది. తక్కువ నిర్వహణ వ్యయాలు, మెరుగైన సామర్థ్యాలను అందించే ఈ టైర్లు ఉత్తమ ఎంపికగా ఉండగలవు. అలాగే, హెవీ-లోడ్ రవాణాకు సంబంధించిన కఠినతరమైన అవసరాలను తీర్చేలా జేడీసీ ఎక్స్‌డీ టైర్ తీర్చిదిద్దబడింది.

ఆన్, ఆఫ్-రోడ్ పరిస్థితుల్లో కూడా ఇది దీర్ఘకాలికమైన పనితీరును కనపరుస్తూ, విశ్వసనీయమైనదిగా ఉంటుంది. మన్నిక, దృఢత్వానికి మారు పేరుగా ఉండే ఈ టైరు, ఆన్ డ్రైవ్ టిప్పర్లు, డమ్మీ యాక్సిల్స్‌లో వినియోగం కోసం రూపొందించింది.
జెట్‌వే జేయూఎక్స్ఈ (JETWAY JUXe):
జెట్‌వే జేయూఎక్స్ఈ ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ బస్సుల కోసం డిజైన్ చేసింది. ఇది ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) సెగ్మెంట్‌లో పనితీరు,సస్టెయినబిలిటీ ప్రమాణాలను పునర్నిర్వచించే ఒక విప్లవాత్మకమైన టైరుగా నిలవగలదు.
ఈ తక్కువ RRc టైర్లు, ప్రతీ చార్జింగ్‌పై ఎలక్ట్రిక్ బస్సులు మరింత ఎక్కువ దూరం ప్రయాణించేందుకు సహాయపడగలవు. దీంతో సామర్ధ్యాలు, నిర్వహణ వ్యయ సంబంధిత ఆదా మెరుగుపడుతుంది.
సస్టెయినబిలిటీ విషయంలో తమకు గల నిబద్ధతకు అనుగుణంగా, ఇంధనాన్ని ఆదా చేసే డిజైన్ గల జేయూఎక్స్‌ఈ ద్వారా జేకే టైర్ తక్కువ-శబ్దపు టైర్ల విభాగంలోకి అడుగుపెట్టినట్లవుతుంది.

ఈ లో-నాయిస్ టైర్లు పట్టణ ప్రాంతాల్లో శబ్ద తీవ్రతను తగ్గించేందుకు తోడ్పడటమే కాకుండా పర్యావరణహిత రవాణా సొల్యూషన్స్‌ను ప్రోత్సహించేందుకు ఉపయోగపడగలవు.
ఎప్పటికప్పుడు మారుతున్న భారతదేశపు సస్టెయినబుల్ మొబిలిటీ వ్యవస్థ అవసరాలకు అనుగుణంగా ఇవి ఉండగలవు.
జెట్‌వే జేయూఎక్స్‌ఈ టైర్లు టాటా మోటర్స్‌కి చెందిన ఈవీ బస్సుల్లో కూడా వినియోగించాయి. భారతదేశ ప్రజా రవాణా రంగంలో ఆవిష్కరణలు, సస్టెయినబిలిటీని ప్రోత్సహించే దిశగా చేస్తున్న చేస్తున్న కృషికి ఇది నిదర్శనంగా నిలవగలదు.