365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, ఏప్రిల్14, 2023: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే వివిధ పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్ధులకోసం స్టడీ మెటీరియల్ ఆన్ లైన్ లో ఉచితంగా అందుబాటులో ఉంచారు.
బి.సి. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ,ఇతర స్టడీ సర్కీల్ లలో ఉచిత శిక్షణ పొందుతున్న అభ్యర్థులు,పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఈ స్టడీ మెటీరియల్ కోసం వెబ్ సైట్స్
1.https://tsbcstudycircle.cgg.gov.in/FirstPage.do,
2.https://youtube.com/@telanganabcstudycircle231,
3.https://urduacademyts.com/study-material-tspsc-group-services/లలో పొందవచ్చు.
పోటీ పరీక్షలకు హాజరయ్యే గ్రామీణ పేద అభ్యర్థుల సౌకర్యార్థం ఈ స్టడీ మెటీరియల్ ను ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చని ఒక అధికారిక ప్రకటనలో వెల్లడించారు.
ఈ స్టడీ మెటీరియల్ ఉర్దూలో కూడా అందుబాటులో ఉందని పేర్కొన్నారు. ఇందులో తెలంగాణ సంస్కృతి,చరిత్ర, జాగ్రఫీ, రాజనీతి, పాలనా శాస్త్ర, ఆర్ధిక,సాంఘిక, జనరల్ సైన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ వ్యక్తిత్వ వికాస పరమైన ఎంతో సమాచారం అందు బాటులో ఉంది.
గ్రూప్ 1,2, ఇతర మోడల్ ప్రశ్నా పత్రాలు, తెలంగాణ ప్రభుత్వ పథకాల సమాచారం అందుబాటులో ఉంచడం జరిగింది. దీని వలన సమయం, దూర ప్రాంతాలకు వెళ్లి వ్యయ ప్రయాసలతో కూడిన భారం తగ్గి,ఆత్మవిశ్వాసంతో స్వయం శిక్షణ పొందే వీలుంటుంది. అదే విధంగా వీడియోలరూపంలోనూ మెటీరియల్ అందుబాటులో ఉంచడం జరిగింది.