365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, మార్చి 31, 2022: మ్యాట్రిమోనీ.కామ్, భారతదేశంలో అగ్రశ్రేణి ఆన్‌లైన్ మ్యాట్రిమోనీ కంపెనీ, ప్రజానీకం కోసం ప్రత్యేకంగా వివాహ సంబంధాల ప్రాంతీయభాషా యాప్- జోడీని ప్రారంభిస్తున్నట్టు ఈ రోజు ప్రకటించింది. ఈ సేవ హిందీలో, మరాఠీ, బెంగాలి, పంజాబీ, గుజరాతీ, తమిళం & తెలుగుతో సహా 9 ఇతర భాషల్లో లభిస్తుంది. గత 22 ఏళ్ళుగా లక్షల మంది భారతీయులకు ఒక జీవిత భాగస్వామిని కనుక్కోవడంలో సాయపడిన తమ విజయవంతమైన చరిత్ర ఆధారంగా ఈ కొత్త సేవను కంపెనీ ప్రారంభించింది, జనాభాలో ఎక్కువ భాగం తమ మాతృభాష లో పెళ్ళిళ్ళను కుదిర్చే ఒక సేవ కోసం ఎదురుచూస్తున్నట్టు గ్రహించింది. ఈ సేవ ఆండ్రాయిడ్ యాప్‌లో అందుబాటులో ఉంటుంది.
డిప్లమా, పాలిటెక్నిక్, 12వ తరగతి, 10వ తరగతి లేదా అంతకన్నా తక్కువ చదివిన వారి అవసరాలను జోడీ యాప్ తీరుస్తుంది. వృత్తి పరిభాషలో చెప్పాలంటే, కార్మికులు ,స్వయం ఉపాధి పొందుతున్నవారికి ఉద్దేశించిన సేవ ఇది. దేశంలోని ఇంటర్నెట్ వినియోగదారుల సమూహంలో దాదాపు 75% వరకూ భారతీయ భాషా వినియోగదారు లే ఉంటారు. భారతదేశంలో 90% మంది వినియోగదారులు తమ స్థానిక భాషలో విషయాలను తెలుసుకోవడానికి ఇష్టపడతారు. తెలుగు భాషను 8 కోట్ల 10 లక్షల మందికి పైగా మాట్లాడతారు, వారిలో 3 కోట్ల 10 లక్షల మంది ఇంటర్‌నెట్ వినియోగదారులు. మొబైల్ ఇంటర్నెట్ వ్యాప్తికి హ్యాండ్ సెట్ల ధరలు పడిపోవడం తోడై, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చిన్న పట్టణాల్లో మొదటిసారి మొబైల్ ఇంటర్నెట్ వినియోగదారుల వృద్ధికి దోహదపడింది.
ఈ వినియోగదారుల్లో చాలామంది ఎన్నడూ ఊహించనంత వేగంతో డిజిటల్ సేవలను స్వీకరించడం ప్రారంభించడానికి ఒక అత్సవసర పరిస్థితిని కొవిడ్ మహమ్మారి సృష్టించింది. ఆన్‌లైన్‌లో పెళ్ళి సంబంధాలు కుదుర్చుకోవడంలో వృద్ధి కనిపించినప్పటికీ, మిగిలిన డిజిటల్ సర్వీసుల్లో కనిపిస్తున్న స్థాయిలో అది లేదు. మార్కెట్లో ప్రస్తుతం ఉన్న వివాహ సంబంధ సేవలు ఇంగ్లీషు భాషలో మాత్రమే ఉండడం, ఉపయోగం లో క్లిష్టత, ఖర్చుతో కూడిన చెల్లింపు ప్లాన్లు లాంటి సమస్యలే దీనికి కారణం. అన్నిటికన్నా ముఖ్యంగా, తమ బంధు, మిత్ర వర్గాల్లో వధువు/ వరుడు ఎంపికలు చాలా కొద్ది సంఖ్యకు మాత్రమే పరిమితం అవడం, సంబంధాల్ని వెతకడంలో ఇతర నమ్మకమైన వనరులు లేకపోవడం తో సహా పెళ్ళిసంబంధాల విషయంలో తమవైన సొంత సవాళ్లను వినియోగదారులు ఎదుర్కొంటున్నారు. ఈ సవాళ్ళను పరిష్కరించడం కోసం జోడీ, భారతదేశంకోసం తయారైన యాప్ ప్రయత్నిస్తుంది.
శ్రీ అర్జున్ భాటియా, సీనియర్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్- మ్యాట్రిమోనీ.కామ్ మాట్లాడుతూ “పెరుగుతున్న డిజిటల్ ప్రపంచంలో, జోడీ ఒక సరళమైన సాంకేతిక పరిష్కారం, తమ కలల్లోని జీవిత భాగస్వామిని వెతకడంలో ప్రతి సాధారణ భారతీయుడికీ ఎదురయ్యే అవరోధాలను అది తొలగిస్తుంది. ఒక సంబంధా న్ని వెతకడంలో ఎంపికను, సౌకర్యాన్నీ, భధ్రతను జోడీ అందిస్తుంది. తమ జీవితాలపై సానుకూల ప్రభావం చూపించే నిర్ణయాలను తీసుకొనే సాధికారతను కూడా మహిళలకు కల్పిస్తున్నాం” అని చెప్పారు.
జోడీ యాప్ ప్రధానాంశాలు:
• జోడీ యాప్‌ను సులువుగా ఉపయోగించవచ్చు, ఇది తెలుగుతో సహా 10 భాషల్లో లభ్యమవుతుంది. ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవడానికి సాధారణ సమాచారాన్ని అది కోరుతుంది.
• వినియోగదారులు తమ సొంత భాషలో రిజిస్టర్ చేసుకోవచ్చు, మతం, నగరం, సామాజికవర్గం, విద్య, ఆదాయం ఆధారంగా తమ సంబంధాన్ని ఎంచుకోవచ్చు.
•తమకు అనువైన జీవిత భాగస్వామిని వెతుకుతున్నప్పుడు గోప్యతను, భద్రతను జోడీ యాప్ అందిస్తుంది. మహిళా సభ్యులు తమ ఫొటో కనిపించకుండా చేయడానికీ, తాము ఇష్టపడిన సంబంధాలకు మాత్రమే అది కనిపించేలా చెయ్యడానికి ఆప్షన్ ఉంది.
•పురుష సభ్యులందరూ తమ ప్రొఫైల్‌ను ఒక ప్రభుత్వ గుర్తింపు ఆధారంతో వెరిఫై చేయించుకోవాల్సి ఉంటుంది.
• జోడీలో రిజిస్ట్రేషన్ ఉచితం, మీకు నచ్చిన ప్రొఫైల్‌కు నేరుగా కాల్ చెయ్యడం లేదా ప్రొఫైల్స్ జాతకాలు చూడడం లాంటి కొన్ని అదనపు ప్రయోజనాల కోసం అందుబా టులో ఉండే చెల్లింపు ప్లాన్లు కూడా ఉన్నాయి.
• ఇంటింటి పేరైన, 22 సంవత్సరాలు ఆన్‌లైన్ మ్యాట్రిమోనీకి మార్గదర్శకమైన విశ్వసనీయ మ్యాట్రిమోనీ సర్వీస్ తెలుగుమ్యాట్రిమోనీ నుంచి జోడీ యాప్ వచ్చింది.
జోడీ యాప్‌ను ఆండ్రాయిడ్ కోసం మీరు ఇక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
https://play.google.com/store/apps/details?id=jodii.app