365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, జనవరి 30, 2023: హైదరాబాద్ లోని గౌలిపురకు చెందిన బీజేపీ కార్యకర్తలు పలువురు బిఆర్ఎస్ పార్టీలో ఆదివారం చేరారు.
రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ సమక్షంలో బంజారా హిల్స్ లోని తన నివాసంలో జరిగిన కార్యక్రమంలో బిజెపిఎస్సీ సెల్ హైదరాబాద్ పార్లమెంటరీ మాజీ ఇంచార్జ్ గాదం సత్యనారాయణతో పాటు గౌలిపుర బిజెపి కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీలో చేరారు.
బిఆర్ఎస్ నాయకుడు పి శ్రీకాంత్ ఆధ్వర్యంలో హోం మంత్రి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకొని బిఆర్ ఎస్ పార్టీకి తమ మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా హోం శాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు దేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలబెట్టారని అన్నారు.

ఎనిమిది ఏళ్ల పాలనలో ఎన్నో ప్రజా సంక్షేమ పథకాల ప్రవేశపెట్టి తెలంగాణ ప్రజలకు సేవ చేశారని తెలిపారు. నిత్యం ప్రజల్లో ఉంటూ వారి ఇబ్బందులను తెలుసుకుంటూ వారి సంక్షేమం కోసం బిఆర్ఎస్ పార్టీ నాయకులు కృషి చేస్తున్నారని తెలిపారు.
అన్ని మతాల వారిని ,అన్ని వర్గాల వారిని సమ దృష్టితో చూస్తూ వారి కోసం సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు మద్దతు తెలపాల్సిన అవసరం ఉందని హోమ్ మంత్రి అన్నారు