365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, అమరావతి, నవంబర్13, 2022: రోజురోజుకీ జర్నలిజం విలువలు దిగజారిపోతున్నాయి. అనర్హులకు జర్నలిస్టుగా అవకాశం ఇవ్వడంవల్ల జర్నలిస్ట్ బ్రాండ్ మరింత తగ్గుతోంది. తాజాగా జర్నలిజానికి తలవంపులు తెచ్చే ఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటుచేసుకుంది.
ఎన్టీఆర్ జిల్లా విసన్నపేట మండలం కొండపర్వ శివారులో ప్రముఖ ఛానళ్లు, ప్రముఖ దిన పత్రికలకు చెందిన జర్నలిస్టులు కారు ఆపి డబ్బులు డిమాండ్ చేశారు. వీరిలో ముగ్గురువిలేకరులు ఛానెల్స్ కు చెందినవారు కాగా మరికొంతమంది ప్రముఖ పత్రికల్లో పనిచేస్తున్నవారుసైతం ఉన్నట్లు తెలుస్తోంది.
విసన్నపేట మండలం కొండపర్వ శివారులో అధికారులమంటూ కారు అడ్డగించి లక్ష రూపాయలు డిమాండ్ చేశారు. కారు అడ్డగించిన ఓ విలేకరిని బంధించి పోలీస్ స్టేషన్లో అప్పగించారు కారు యజమాని. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని పలు సెక్షన్ల CR.NO 387/2022..34, 341,384, R/W 511కింద కేసు నమోదు చేశారు.