365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,న్యూఢిల్లీ,ఫిబ్రవరి 2, 2026: సమాజ సేవలో భాగంగా ‘MG సేవా’ కార్యక్రమం కింద JSW MG మోటార్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలోని చిన్మయ మిషన్ నిర్వహిస్తున్న వివిధ సామాజిక, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో తక్షణ వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన (రెట్రోఫిటెడ్) MG హెక్టర్ అంబులెన్స్‌ను ఆ సంస్థకు విరాళంగా అందజేసింది.

లోధి రోడ్డులోని ‘చిన్మయ సెంటర్ ఆఫ్ వరల్డ్ అండర్స్టాండింగ్’ వద్ద జరిగిన అధికారిక కార్యక్రమంలో ఈ వాహనాన్ని అప్పగించారు.

అత్యునాతన వైద్య సదుపాయాలతో అంబులెన్స్
సాధారణ MG హెక్టర్ వాహనాన్ని అత్యవసర వైద్య సేవల కోసం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఇందులో రోగుల ప్రాణాలను రక్షించేందుకు అవసరమైన కింది సదుపాయాలు ఉన్నాయి:

ఆక్సిజన్ డెలివరీ సిస్టమ్, వెంటిలేటర్ సపోర్ట్.

Read this also..JSW MG Motor India Bolsters Community Healthcare with Retrofitted MG Hector Ambulance Donation..

Read this also..Naga Chaitanya Labels Goa Street Race “Make or Break” for Hyderabad Black Birds’ Title Hopes..

రోగి పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనించే పారా మానిటరింగ్ పరికరాలు.

రోగులను సులభంగా తరలించేందుకు ఆటో లోడర్ స్ట్రెచర్.

వైద్య సామాగ్రి కోసం ప్రత్యేకంగా రూపొందించిన స్టోరేజీ స్పేస్.

Read this also..Union Budget 2026: 10 Strategic Takeaways for a Developing India..

Read this also..PJTAU to Submit Landmark Satellite-Based Crop Report to Telangana Government on Feb 6..

ఆరోగ్యకరమైన జీవనంపై అవగాహన
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ గణేష్ కుమార్ మణి మాట్లాడుతూ.. ప్రస్తుత కాలంలో పెరుగుతున్న గుండె జబ్బులపై ఆందోళన వ్యక్తం చేశారు.

ధూమపానం, ఒత్తిడి, చక్కెర, ఉప్పు, ఆల్కహాల్ వంటి ఏడు ‘S’ కారకాలను దూరం పెట్టాలని ఆయన సూచించారు. అత్యవసర సమయంలో ‘గోల్డెన్ అవర్’లో వైద్యం అందడం ప్రాణాలను కాపాడుతుందని ఆయన పేర్కొన్నారు.

JSW MG మోటార్ ఇండియా చీఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్ యశ్విందర్ పటియాల్ మాట్లాడుతూ.. “హెక్టర్ వాహనం దృఢత్వం,ఆధునిక సాంకేతికత అత్యవసర వైద్య సహాయానికి ఎంతో అనువైనవి. ఆరోగ్య సదుపాయాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా MG సేవా ఈ చొరవ తీసుకుంది,” అని తెలిపారు.

చిన్మయ మిషన్ ప్రతినిధులు బ్రహ్మచారి సోహమ్ చైతన్య ,శ్రీ జతిందర్ ధీర్ అంబులెన్స్ కీలను అందుకున్నారు. ఈ వాహనం చిన్మయ మిషన్ నిర్వహించే నివాస శిబిరాలు, శిశు విహార్,వనప్రస్థ వంటి కార్యక్రమాల్లో వేలాది మందికి వైద్య రక్షణగా నిలవనుంది.