365 తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, అక్టోబర్ 6,2025 : జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గానికి (Jubilee Hills Assembly Constituency) ఉపఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం (CEC) తాజాగా విడుదల చేసింది.
కీలక తేదీలు ఈ విధంగా ఉన్నాయి. నోటిఫికేషన్ విడుదల: ఈ నెల (అక్టోబరు) 13వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది.
నామినేషన్ల స్వీకరణ: అక్టోబర్ 13వ తేదీ నుంచి 21వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. నామినేషన్ల పరిశీలన: అక్టోబర్ 22వ తేదీన నామినేషన్లను పరిశీలించడం జరుగుతుంది.

పోలింగ్ తేదీ: నవంబర్ 11వ తేదీన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు: పోలింగ్ ముగిసిన మూడు రోజుల తర్వాత, నవంబర్ 14వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి, ఎన్నికల ఫలితాలను ప్రకటించనున్నారు.