365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,రోటర్‌డామ్, మే 23, 2025: భారతదేశపు పునరుత్పాదక ఇంధన రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న సంస్థ జునో జౌల్ గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్, ప్రముఖ జర్మన్ క్లీన్ ఎనర్జీ సంస్థ సెలెక్ట్ ఎనర్జీ GmbHతో వ్యూహాత్మక అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది.
ఈ ఒప్పందం నెదర్లాండ్స్‌లోని రోటర్‌డామ్‌లో జరిగిన ప్రతిష్టాత్మక వరల్డ్ హైడ్రోజన్ సమ్మిట్ 2025 సందర్భంగా మే 21న కుదిరింది.
ఇండో-జర్మన్ సహకారానికి ఇది ఒక కీలక మైలురాయిగా నిలిచింది. దీనిద్వారా ఆంధ్రప్రదేశ్‌లోని ములాపేట ఓడరేవు వద్ద ప్రపంచ స్థాయి గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి కేంద్రాన్ని అభివృద్ధి చేయనున్నట్లు సంస్థ వెల్లడించింది. ఈ ప్రాజెక్ట్ యూరప్, జపాన్, దక్షిణ కొరియా వంటి అంతర్జాతీయ మార్కెట్లకు గ్రీన్ ఇంధనం ఎగుమతులపై దృష్టి సారించనుంది.
ఇది కూడా చదవండి…ఎలక్ట్రిక్ వాహన ఛార్జింగ్‌లో కొత్త అధ్యాయం : హార్మొనీ డైరెక్ట్ 2.0ను విడుదల చేసిన ఎక్సికామ్
Read This also…Exicom Unveils Harmony Direct 2.0: A Game-Changer in EV Charging with India’s First Indigenous Charger OS
ఈ కార్యక్రమంలో జునో జౌల్ సీఈఓ నాగశరత్ రాయపాటి,సెలెక్ట్ ఎనర్జీ GmbH మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఫెలిక్స్ డేంజర్లు పాల్గొని ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ సమావేశానికి భారత ప్రభుత్వం తరఫున MNRE కార్యదర్శి సంతోష్ కుమార్ సారంగి నేతృత్వం వహించగా, నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ డైరెక్టర్ జనరల్ అభయ్ బక్రీ కూడా హాజరయ్యారు. జర్మనీ తరఫున జర్మన్ హైడ్రోజన్ అసోసియేషన్ అధ్యక్షురాలు శ్రీమతి సిల్కే ఫ్రాంక్ ,ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా ఆంధ్రప్రదేశ్,తెలంగాణ రాష్ట్రాలలో పెట్టుబడులు, ఉద్యోగావకాశాలు, గ్లోబల్ హైడ్రోజన్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి మద్దతుగా నిలవనుంది.
ప్రాజెక్ట్ విశేషాలు:
- ప్రాజెక్ట్ పెట్టుబడి విలువ: 1.3 బిలియన్ డాలర్లు (రూ. 10,000 కోట్లు)
- ఉత్పత్తి లక్ష్యం: 2029 నాటికి 180 KTPA గ్రీన్ హైడ్రోజన్
- నిర్మాణ ప్రారంభం: 2026
- ఉపాధి అవకాశాలు: ప్రత్యక్షంగా ,పరోక్షంగా 5,000 – 6,000 మందికి
ఈ సందర్భంగా జునో జౌల్ సీఈఓ రాయపాటి మాట్లాడుతూ, “భారతదేశాన్ని ప్రపంచ గ్రీన్ ఎనర్జీ కేంద్రంగా తీర్చిదిద్దాలన్న మా లక్ష్యానికి అనుగుణంగా సెలెక్ట్ సంస్థతో భాగస్వామ్యం చేయడం ఎంతో సంతోషకరం.
Read This also…Alembic Pharmaceuticals Receives USFDA Final Approval for Amlodipine and Atorvastatin Tablets..
Read This also…MSME Credit Grows 13% YoY; Delinquencies Hit 5-Year Low..
ఈ సహకారం, తక్కువ కార్బన్ ఉత్పత్తి ఆర్థిక వ్యవస్థవైపు ప్రపంచ మార్పును వేగవంతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది” అని తెలిపారు.