365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, జూన్ 27,2025 : మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్, భారీ అంచనాల మధ్య రూపొందిన ‘కన్నప్ప’ చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించగా, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించారు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, బాలీవుడ్ అగ్ర నటుడు అక్షయ్ కుమార్, రెబల్ స్టార్ ప్రభాస్ వంటి తారలు కీలక పాత్రలు పోషించిన ఈ పాన్ ఇండియా చిత్రం, ప్రీమియర్ షోలతోనే మంచి స్పందనను రాబట్టింది.
శరత్ కుమార్: తమిళ నటుడు శరత్ కుమార్ నాథనాధుడు పాత్రలో తన గంభీరమైన వాయిస్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మోహన్ బాబు: నిర్మాతగానే కాకుండా, మహాదేవ శాస్త్రి పాత్రలో మోహన్ బాబు తనదైన డైలాగ్ డెలివరీతో, అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో జీవించేశారు.

ప్రీతి ముకుందన్: హీరోయిన్ ప్రీతి ముకుందన్ ఛాలెంజింగ్ పాత్రలో ఒదిగిపోయి మెప్పించారు.ప్రభాస్ హైలైట్: ఇక సినిమాకే హైలైట్‌గా నిలిచింది రెబల్ స్టార్ ప్రభాస్ నటన. సినిమాలో కీలకమైన 40 నిమిషాల ఎపిసోడ్‌ను ప్రభాస్ తన భుజాలపై మోశారు. ప్రభాస్ డైలాగ్స్ విషయంలో రైటర్ ప్రత్యేక శ్రద్ధ చూపినట్లు స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా ప్రభాస్ పలికించిన ‘పెళ్లి’ డైలాగ్‌కు థియేటర్లు హోరెత్తిపోయాయి.
Read This also…River Expands Footprint in Andhra Pradesh with First Vijayawada Store
ఇది కూడా చదవండి…యూఎస్‌కు చెందిన అలూకెమ్‌ను $125 మిలియన్లకు కొనుగోలు చేయనున్న హిందాల్కో..
Read This also…PhonePe and HDFC Bank Launch Co-Branded RuPay Credit Card with UPI Integration and Exciting Rewards
మంచు విష్ణు కెరీర్ బెస్ట్: క్లైమాక్స్ సన్నివేశాల్లో మంచు విష్ణు నటన ‘కెరీర్ బెస్ట్’ అనే టాక్ తెచ్చుకుంది. శివయ్యకు తన కన్ను దానం చేసే సన్నివేశం సినిమాకే హైలైట్‌గా నిలిచి, విష్ణు నటన ప్రేక్షకులతో కంటతడి పెట్టించింది. ఈ భారీ చిత్రాన్ని నిర్మించిన మోహన్ బాబు, అలాగే ఈ కథను నమ్మి అద్భుతమైన నటనతో మెప్పించిన మంచు విష్ణును ప్రత్యేకంగా అభినందించాలి. పాటలతో పాటు, నేపథ్య సంగీతం కూడా మెచ్చుకోదగ్గ స్థాయిలో ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి, ‘కన్నప్ప’ తనపై ఉన్న భారీ అంచనాలనుఅందుకుందనేచెప్పాలి.