Fri. Nov 22nd, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,జనవరి 29, 2024 : ఆంధ్రప్రదేశ్ లోని రేపల్లె నియోజకవర్గంలో కాపు సోదరులు సీనియర్ పాత్రికేయులు అల్లంశెట్టి నరేష్ పై పెట్టిన ఎస్సీ,ఎస్టీ ఎట్రాసిటీ కేసును విచారణ జరిపి తొలగించాలని కాపు జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు చందు జనార్ధన్ డిమాండ్ చేశారు.

పాత్రికేయుడిగా విధులు నిర్వహిస్తున్న తనపై అక్రమంగా కేసులు పెట్టి, అనవసరంగా కక్ష సాదింపులకు పాల్పడుతున్నారని బాధితుడు అల్లంశెట్టి నరేష్ తెలిపారు. సోమవారం కాపు జేఏసీ అధ్యక్షులు చందు జనార్ధన్ ను కలిసి తనపై జరుగుతున్నా కుట్రలను గురించి వివరించారు.

ఈ సందర్భంగా కాపు జేఏసీ అధ్యక్షులు చందు జనార్ధన్ మాట్లాడుతూ.. ముఖ్యంగా రేపల్లె నియోజకవర్గంలో జర్నలిస్టులపై కేసులు పెరిగిపోయాయని” అన్నారు‌.

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి స్టేట్ బ్యూరోలో సీనియర్ జర్నలిస్టుగా పనిచేస్తోన్న అల్లంశెట్టి నరేష్ పై రేపల్లెలో అక్రమంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడాన్నిచందు జనార్థన్ ఖండించారు.

గతంలో ఢిల్లీలో పనిచేసి.. ప్రస్తుతం హైదరాబాద్ బ్యూరోలో సీనియర్ జర్నలిస్టుగా అల్లంశెట్టి నరేష్ పనిచేస్తున్నారని.. రేపల్లెలో లేకపోయిన ప్పటికీ జర్నలిస్ట్ నరేష్ పై అట్రాసిటీ కేసు నమోదు చేయడం ముమ్మాటికీ కక్ష సాధింపేనని, ఇది సరి కాదన్నారు.

సీనియర్ జర్నలిస్ట్ అల్లంశెట్టి నరేష్ పై నమోదు చేసిన కేసుపై రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణరావు దృష్టి సారించి, కాపులపై వేధింపులు నిరోధించాలని కాపు జేఏసీ అధ్యక్షులు చందు జనార్ధన్ ఈ సందర్భంగా కోరారు.

error: Content is protected !!