Thu. Dec 12th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,అమలాపురం,నవంబర్ 29,2024:సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2023 జనవరి 8న ట్విట్టర్ వేదికగా కాపు కులంపై చేసిన వ్యాఖ్యలపై కాపునాడు సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఈ నేపథ్యంలో, రామ్ గోపాల్ వర్మపై బి.యన్.యస్ 196 సెక్షన్,ఇతర సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని కోరుతూ, అమలాపురం పట్టణ పోలీస్ స్టేషన్లో రాష్ట్ర కాపునాడు వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్బిరెడ్డి సురేష్ పిలుపు మేరకు సంయుక్త కార్యదర్శి అబ్బిరెడ్డి శ్రీరామ్మూర్తి కాపునాడు సంఘ సభ్యులు పిర్యాదు చేశారు.

రామ్ గోపాల్ వర్మ 2023 జనవరి 8న తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవనారాచంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవ కొణిదెల పవన్ కళ్యాణ్ భేటీ అయిన సందర్భంలో, రానున్న ఎన్నికలలో సీట్ల సర్దుబాటు గురించి చర్చించుకున్నారు.

ఈ సమయంలో, రామ్ గోపాల్ వర్మ తన ట్విట్టర్ అకౌంట్‌లో “RIP కాపులు – కంగ్రాట్యులేషన్స్ కమ్మోళ్లు” అనే వ్యాఖ్యలు చేశారని పిర్యాదులో పేర్కొనడమైనది.

ఈ వ్యాఖ్యలు కాపు కులానికి అవమానకరమైనవి, వారిని కించపరిచేలా ఉన్నాయని కాపు సంఘం ఫిర్యాదులో పేర్కొంది. “RIP” అనే పదం కాపు కులానికి శ్రద్ధాంజలి అంటూ భావిస్తూ, దీనితో కాపు కుల ప్రజల మనోభావాలను దెబ్బతీశారని చెప్పారు.

రామ్ గోపాల్ వర్మ తన అనాగరిక ధోరణితో కులాల మధ్య అంతరాలు పెంచి, సమాజంలో అశాంతి సృష్టించారని, అందువల్ల అతనిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ సందర్భంగా, కాపునాడు నాయకులు రామ్ గోపాల్ వర్మ పై చట్టపరమైన కఠిన చర్యలు చేపట్టి, అతనికి తగిన శిక్షలు విధించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో కాపునాడు నాయకులు గంగుమళ్ళ శ్రీనివాస్, పత్తి దత్తుడు, తోట శ్రీను, అడబాల తాతకాపు, విళ్ళ సుబ్బారావు, గుండాబత్తుల తాతాజీ, జాంబ తిరుపనాదం, చాగంటి ప్రసాద్, దైవాల రాంబాబు, పోలిశెట్టి వీరబాబు, గుర్రాల రమేష్, గారపాటి బాలాజీ, వింటి దిలీప్, దార్లంక సురేష్ కాపు యువత పాల్గొన్నారు.

error: Content is protected !!