Ammapalli

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,నవంబర్ 22, 2022: అమ్మపల్లి అభయ ఆంజనేయ స్వామి వారి విగ్రహం వద్ద కార్తీక మాస మహా దీపారాధన.. అయ్యప్ప స్వామి పూజ ఘనంగా జరిగింది. కార్తీక మాస చివరి మంగళవారం కావడంతో రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ మండల అమ్మపల్లి అభయ ఆంజనేయ స్వామి వారి విగ్రహం వద్ద రాష్ట్ర ఓబీసీ మోర్చ కార్యనిర్వాహక సభ్యులు బుక్క కృష్ణస్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి పూజ, మహాదీపారాధన నిర్వహించారు.

Ammapalli

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్ కుటుంబ సమేతంగా అయ్యప్పస్వామి పూజలో పాల్గొని అయ్యప్ప స్వాములకుభోజన ప్రసాదాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో బాబు గురుస్వామి, అమ్మపల్లి సన్నిధాన స్వాములు, శంషాబాద్ మండల ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.