Kasam-Group's-fashion-store

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,సెప్టెంబర్ 15,2022: : ప్రముఖ వస్త్ర సంస్థ కాసం ఫ్యాషన్ గ్రూప్ మరో ముందడుగు వేసింది. షాద్ నగర్ లో నూతన బ్రాంచ్ ను ప్రారంభించింది. అన్ని హంగులతో బట్టల షోరూంను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి షాద్ నగర్ ఎమ్మెల్యే వై.అంజయ్య యాదవ్ ,సినీ నటి లావణ్య త్రిపాఠి, షాద్ నగర్ మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్ లు ముఖ్యఅతిథులుగా పాల్గొని నూతన స్టోర్ ను లాంఛనంగా ప్రారంభించారు.

ఫ్యాషన్ రంగలో దాదాపు 76 సంత్సరాల అనుభవం కలిగిన “కాసం గ్రూప్స్” నుంచి సరికొత్త స్టోర్ షాద్ నగర్ పరిగి రోడ్ లో ప్రారంభించారు.కసం గ్రూప్ మొదటి స్టోర్ 1945 సంవత్సరంలో వరంగల్‌లో ప్రారంభించారు. తెలంగాణలోని వరంగల్‌లో ఉన్న కుటుంబ-నేతృత్వంలోని గ్రూప్, ఇప్పుడు 76 ఏళ్లుగా పురుషులు, మహిళలు , పిల్లల కోసం ఫ్యాషన్‌వేర్ రంగంలో తనకంటూ ఒక ఉన్నతమైన ఖ్యాతిని సంపాదించుకుంది.

ఫ్యామిలీ అంతా కలిసి షాపింగ్ చేసుకునేలా ప్రతి స్టోర్ లో అందరికీ నచ్చిన లేటెస్ట్ కలెక్షన్స్ సరసమైన ధరలకే అందిస్తున్నారు. దేశవ్యాప్తంగా కసం గ్రూప్స్ కు దాదాపు 80కి పైగా స్టోర్స్ ఉన్నాయి.