365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి, జూలై 2, 2023: తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో జ్యేష్ఠాభిషేకంలో రెండో రోజైన శనివారం కవచప్రతిష్ట వైభవంగా జరిగింది.ఇందులో భాగంగా ఆలయంలో ఉదయం శతకలశస్నపనం, మహాశాంతి హోమం చేపట్టారు.

అనంతరం ఆలయంలోని కల్యాణమండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజ స్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు.
ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, కొబ్బరి నీళ్లతో విశేషంగా అభిషేకం చేశారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి కవచప్రతిష్ట చేశారు. సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాఢ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు.
