365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, అక్టోబర్ 4, 2025: హైదరాబాద్‌లో రెండు ముఖ్యమైన కార్యక్రమాలను ప్రకటించింది. అవి: అభ్యాస్ లెక్స్ క్వెస్ట్‌ను ప్రారంభించడం, అండ్ ‘ది క్రానికల్స్ ఆఫ్ చేంజ్’ అనే కాఫీ టేబుల్ పుస్తకాన్ని ఆవిష్కరించడం.
అభ్యాస్ లెక్స్ క్వెస్ట్ ప్రారంభం..
ఐఐఎం బెంగళూరు పూర్వ విద్యార్థి, ఎన్‌ఐటీ వరంగల్ గోల్డ్ మెడలిస్ట్ అయిన నరేష్ రెడ్డి దుబ్బుడు స్థాపించిన అభ్యాస్ ఎడ్యు టెక్నాలజీస్, తమ ప్రత్యేక విభాగమైన అభ్యాస్ లా ప్రెప్ ద్వారా 9 నుంచి 12 తరగతుల విద్యార్థుల కోసం దేశవ్యాప్తంగా ‘అభ్యాస్ లెక్స్ క్వెస్ట్’ను ప్రవేశపెడుతోంది.
ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి సంప్రదాయ ఎంపికలకే పరిమితం కాకుండా, విద్యార్థులు తమ సామర్థ్యాలను గుర్తించుకోవడానికి, వైవిధ్యభరితమైన కెరీర్ మార్గాలను అన్వేషించడానికి ఈ ప్రత్యేక ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉపయోగపడుతుందని సంస్థ పేర్కొంది.
సెప్టెంబర్ నుంచి నవంబర్ మధ్య వివిధ పాఠశాలల్లో 60 నిమిషాల ఈ ఆప్టిట్యూడ్ టెస్ట్ మొదటి రౌండ్ నిర్వహించ నున్నారు. నవంబర్ 26న ‘లా డే’ సందర్భంగా గ్రాండ్ ఫినాలే, మెగా బూట్‌క్యాంప్ ప్రారంభమవుతాయి.
కెరీర్ ఎంపికలో..

ఈ సందర్భంగా అభ్యాస్ ఎడ్యు టెక్నాలజీస్ వ్యవస్థాపకులు, డైరెక్టర్ నరేష్ రెడ్డి దుబ్బుడు మాట్లాడుతూ, “అభ్యాస్ లెక్స్ క్వెస్ట్ అనేది కేవలం పరీక్ష మాత్రమే కాదు; విద్యార్థులు తమ నిజమైన సామర్థ్యాన్ని తెలుసుకోవడానికి, కెరీర్ ఎంపికలు సంప్రదాయ పద్ధతుల ద్వారా కాకుండా ఆప్టిట్యూడ్, అభిరుచి ద్వారా ఉండాలని మేం నమ్ముతున్నాం” అని తెలిపారు.
‘ది క్రానికల్స్ ఆఫ్ చేంజ్’ పుస్తకావిష్కరణ..
భారత సుప్రీంకోర్టు 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని, అభ్యాస్ లా ప్రెప్ తమ తొలి కాఫీ టేబుల్ పుస్తకం ‘ది క్రానికల్స్ ఆఫ్ చేంజ్’ను బంజారా హిల్స్‌లోని హోటల్ మెర్క్యూర్ కెసిపిలో ఆవిష్కరించింది.
భారతీయ చట్టాలు, రాజ్యాంగ స్థితిగతులను రూపొందించిన 75 మైలురాయి తీర్పులను ఈ పుస్తకం అందిస్తుంది.
నరేష్ రెడ్డి దుబ్బుడు ఈ పుస్తకం గురించి వివరిస్తూ, “భారత ప్రజాస్వామ్యానికి సుప్రీంకోర్టు సంరక్షకుడిగా ఉంది. దాని తీర్పులు మన సమాజంపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి.
ఈ పుస్తకం ద్వారా, న్యాయం శక్తిని ప్రతి పౌరుడికి – ముఖ్యంగా యువతకు – తెలియజేయాలని మేం కోరుకుంటున్నాం” అని వ్యాఖ్యానించారు.
ఫోర్బ్స్ ఇండియా గుర్తింపు, మూడుఈటీ ఇండస్ట్రీ అవార్డుల విశ్వసనీయతతో, అభ్యాస్ దేశ యువతకు స్ఫూర్తినిస్తూ, విద్యను అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తోంది. https://abhyas.ai/