365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఢిల్లీ, ఫిబ్రవరి 18, 2023: గూడ్స్ అండ్ టాక్స్ (జీఎస్టీ) కౌన్సిల్ 49వ సమావేశం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగింది. ఈ సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
జీఎస్టీ కౌన్సిల్ సమావేశం అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ జీఎస్టీ పరిహారం పెండింగ్‌లో ఉన్న మొత్తాన్ని పూర్తిగా చెల్లిస్తామని ప్రకటించారు.
జూన్‌లో మొత్తం రూ. 16,982 కోట్లతో జీఎస్టీ పరిహారం మొత్తం పెండింగ్ బ్యాలెన్స్ క్లియర్ చేశామని ఆమె పేర్కొన్నారు. జీఎస్టీ కౌన్సిల్ సమావేశం అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయాన్ని వెల్లడించారు.
“ఈ మొత్తాన్ని మా సొంత వనరుల నుంచి విడుదల చేయాలని నిర్ణయించు కున్నాం. భవిష్యత్తులో పరిహారం సెస్ వసూళ్ల నుంచి సమాన మొత్తం అందుతుంది.
ఈ విడుదలతో, జిఎస్‌టి (రాష్ట్రాలకు పరిహారం) చట్టం కింద ఉద్దేశించిన సెస్ మొత్తానికి సంబంధించి గత ఐదేళ్ల బకాయిలను కేంద్రం క్లియర్ చేస్తుందని” నిర్మలా సీతారామన్ తెలిపారు.
బెల్లం,పెన్సిల్‌లు, షార్పనర్‌లపై జిఎస్‌టి రేట్లను తగ్గించినట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. దీంతో పాటు పాన్ మసాలా, గుట్కాపై జీవోఎం సిఫార్సులకు ఆమోదం లభించింది.
వాటిపై సామర్థ్యం ఆధారిత పన్నును అమలు చేయాలని నిర్ణయించారు. వీటిని కచ్చితంగా అమలు చేయాలని సూచించారు. జీఎస్టీ అప్పిలేట్ ట్రిబ్యునల్ నివేదిక ఆమోదించింది. రాష్ట్రాల కోరిక మేరకు దీని నిర్వచనం మార్చబడుతుంది.
ఆర్థిక మంత్రి ప్రకారం బెల్లంపై జీఎస్టీ రేటు సున్నాకి తగ్గించారు. లిక్విడ్ బెల్లంపై జీఎస్టీని 18 శాతం నుంచి శూన్యానికి తగ్గించారు. అంటే దానిపై ఎలాంటి పన్ను ఉండదు. అదే సమయంలో, ప్యాకేజ్డ్ లిక్విడ్ బెల్లం మీద GST రేటు 18శాతం నుంచి 5శాతానికి తగ్గించారు. పెన్సిల్‌లు, షార్పనర్‌లపై జీఎస్‌టీ రేట్లను 18 శాతం నుంచి 12 శాతానికి తగ్గించారు.
మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా నేతృత్వంలో మంత్రుల బృందం ఉన్నందున ఆన్‌లైన్ సమావేశంలో తీసుకోలేమని, రాష్ట్రంలో ఎన్నికల కారణంగా ఆయన జిఎస్‌టి కౌన్సిల్ సమావేశానికి హాజరు కాలేరని సీతారామన్ చెప్పారు.
ఎస్‌యూవీల తరహాలో ఏయూవీ(ఎంయూబీ)లపై కూడా పన్ను విధించే నిర్ణయాన్ని వాయిదా వేసినట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. వార్షిక రిటర్న్‌ల దాఖలులో జాప్యం కోసం ఆలస్య రుసుమును హేతుబద్ధీకరించాలని కూడా జీఎస్టీ కౌన్సిల్ సిఫార్సు చేసింది.
మూడు ఫామ్‌ల జీఎస్‌టీఆర్ ఫారం నం. 4, 9, 10పై ఆలస్య రుసుమును తగ్గించినట్లు రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా తెలిపారు. నెలవారీ రాబడులు అయిన GSTR 1, 3 కోసం ఇంతకు ముందు ఇటువంటి ఉపశమనం ఇచ్చారు. ఇప్పుడు ఈ మూడు ఫారాలపై కూడా ఆలస్య రుసుమును తగ్గించారు.