365తెలుగు డాట్ కామ్ ఆన్ న్యూస్,నవంబర్ 9,2024: ఏపీ కూటమి ప్రభుత్వం, నామినేటెడ్ పదవుల రెండో జాబితా ప్రకటించగా, ఈ జాబితాలో జనసేన పార్టీకి కొన్ని ముఖ్యమైన పదవులు కేటాయించారు. ఈ మేరకు, వివిధ సంక్షేమ కార్పొరేషన్లు, డెవలప్మెంట్ బోర్డులు, అర్బన్ డెవలప్మెంట్ అధారిటీలు జనసేన పార్టీకి అప్పగించబడ్డాయి.
ఈ విధంగా జనసేనకు కేటాయించిన పదవులు:
ఏపీ తూర్పు కాపు వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్
పాలవలస యశస్వి (శ్రీకాకుళం – జనసేన)
ఏపీ అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్
చిలకలపూడి పాపారావు (రేపల్లె – జనసేన)
ఏపీ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవెలప్మెంట్ కార్పొరేషన్
చిల్లపల్లి శ్రీనివాస రావు (జనసేన)
ఏపీఎస్ఆర్టిసి రీజనల్ బోర్డు ఛైర్మెన్
రెడ్డి అప్పల నాయుడు (విజయవాడ జోన్ – జనసేన)
అనంతపూర్ – హిందూపూర్ అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ
టిసి. వరుణ్ (అనంతపూర్ – జనసేన)
కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ
తుమ్మల రామస్వామి (కాకినాడ – జనసేన)
శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ
కోరికన రవికుమార్ (శ్రీకాకుళం – జనసేన)
ఏపీ క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్
వి. సూర్యనారాయణ రాజు (కనకరాజు సూరి) (భీమవరం – జనసేన)
ఏపీ స్టేట్ కాపు వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్
కొత్తపల్లి సుబ్బారాయుడు (నరసాపురం – జనసేన)
ఏపీ మాల వెల్ఫేర్ కోపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్
డాక్టర్ పెదపూడి విజయ్ కుమార్ (ఒంగోలు – జనసేన)
ఈ నామినేటెడ్ పదవుల ద్వారా జనసేన పార్టీకి చెందిన కాపు, క్షత్రియ, మాల, అగ్నికుల, ఇతర సామాజిక సంక్షేమానికి కృషి చేస్తూ, ఆ పార్టీలోని ముఖ్య నేతలతో రాష్ట్రంలో అభివృద్ధిని సాగించేందుకు వ్యూహాలు రూపొందించారు.