365తెలుగు డాట్ కామ్, ఆన్ లైన్ న్యూస్,అక్టోబర్ 4, 2020,ఖమ్మం:పుస్తకాలు జ్ఞానాన్నిపెంచుతాయని గ్రామస్తులు పుస్తక విజ్ఞానాన్ని పెంచుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఖమ్మం జిల్లా అడిషనల్ కలెక్టర్ స్నేహలత అన్నారు. ఆమె శనివారం పెగళ్లపాడు గ్రామం లో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ప్రజల సహకారంతో ఏర్పాటుచేసిన మినీ లైబ్రరీని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ… మినీ లైబ్రరీ ఏర్పాటు చేసిన పెగళ్లపాడు గ్రామ పంచాయతీని ప్రతి గ్రామం ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. అనంతరం ఎర్రుపాలెం మండల కేంద్రంలో నిర్మించిన పల్లె ప్రకృతి వనం ను ఆమె సందర్శించారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి, ఎర్రుపాలెం ఎంపీపీ దేవరకొండ శిరీష, సర్పంచుల సంఘం అధ్యక్షుడు మొగిలి అప్పారావు,పెగళ్లపాడు సర్పంచ్ సగ్గుర్తి రాజేశ్వరి,ఎంపీటీసీ కిషోర్ బాబు, గ్రామ పంచాయతీ సెక్రటరీలు వెంకటరమణ, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.