365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,మార్చి 28, 2025: కియా EV6 Vs హ్యుందాయ్ ఐయోనిక్5 కొత్త EV6 ను కియా మార్చి 26, 2025న అధికారికంగా ప్రారంభించింది. ఈ వాహనాన్ని ప్రీమియం ఎలక్ట్రిక్ SUV విభాగంలో మార్కెట్లోకి తీసుకువచ్చారు. ఇది హ్యుందాయ్ ఐయోనిక్5 తో నేరుగా పోటీ పడనుంది. బ్యాటరీ, మోటారు, ఫీచర్లు, ధర పరంగా ఏ SUV బెటర్ ఆప్షన్..?
దక్షిణ కొరియా ఆటోమొబైల్ తయారీదారు కియా భారత మార్కెట్లో కియా EV6 ఫేస్‌లిఫ్ట్‌ను విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ SUV మార్కెట్లో హ్యుందాయ్ ఐయోనిక్5 SUV తో పోటీ పడనుంది.
కియా EV6 Vs హ్యుందాయ్ ఐయోనిక్5 ఫీచర్లు..
కియా EV6 లో అనేక గొప్ప ఫీచర్లను అందించింది. ఇది వెడల్పాటి ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, స్టార్‌మ్యాప్ LED టెయిల్ ల్యాంప్‌తో కూడిన సీక్వెన్షియల్ ఇండికేటర్లు, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, 19 అంగుళాల అల్లాయ్ వీల్స్, డ్యూయల్ LED హెడ్‌ల్యాంప్‌లు, 12.3 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 12.3 అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, డిజిటల్ కీ, V2L, V2V, OTA సాఫ్ట్వేర్ అప్డేట్, స్మార్ట్ పవర్డ్ టెయిల్‌గేట్,
హెడ్-అప్ డిస్ప్లే, 14 స్పీకర్ మెరిడియన్ ఆడియో సిస్టమ్, ఎలక్ట్రిక్ ఫోల్డింగ్ రియర్ వ్యూ మిర్రర్, LED ఫాగ్ ల్యాంప్, రెయిన్ సెన్సింగ్ వైపర్, ఆటో హెడ్‌ల్యాంప్, 64 కలర్ యాంబియంట్ లైట్లు, డబుల్ D కట్ స్టీరింగ్ వీల్, 10 వే పవర్డ్ మెమరీ సీట్ ఫంక్షన్, ఛార్జింగ్ పోర్ట్, డ్యూయల్ జోన్ ఆటో AC వంటి అనేక లక్షణాలను కలిగి ఉంది.
భద్రత కోసం, అడాస్ 25 ఫీచర్లతో..
మరోవైపు, హ్యుందాయ్ ఐయోనిక్5లో LED హెడ్లైట్లు, LED టెయిల్ లైట్లు, ఆటో ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, 20 అంగుళాల అల్లాయ్ వీల్స్, డ్యూయల్ టోన్ ఇంటీరియర్, పనోరమిక్ సన్‌రూఫ్, అన్ని సీట్లకు మెమరీ ఫంక్షన్, ఎనిమిది స్పీకర్ బోస్ ఆడియో సిస్టమ్,
ముందు వెంటిలేటెడ్, హీటెడ్ సీట్లు, ముందు పవర్డ్ సీట్లు, V2L, 12.3 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, హీటెడ్ అవుట్‌సైడ్ మిర్రర్లతో LED టర్న్ ఇండికేటర్లు, 21 ఫీచర్లతో అడాస్ వంటి అనేక ఫీచర్లు అందించారు.
కియా EV6 Vs హ్యుందాయ్ ఐయోనిక్5 బ్యాటరీ, మోటార్, రేంజ్
కియా EV6 84 kWh సామర్థ్యం గల బ్యాటరీతో అమర్చబడి ఉంది. 350kW DC ఫాస్ట్ ఛార్జర్‌ని ఉపయోగించి 10-80 శాతం ఛార్జ్ చేయడానికి 18 నిమిషాలు పడుతుంది. ఈ SUV లోని మోటారు 325 PS శక్తిని, 605 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ SUVని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 650 కిలోమీటర్లకు పైగా నడపవచ్చు. దీనిలో ఆల్ వీల్ డ్రైవ్ మాత్రమే అందించారు.
ఇది కూడా చదవండి.. ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఆక్టా vs డిఫెండర్: డిజైన్, ఫీచర్స్ ఎలా ఉన్నయంటే..?
Read this also…ORRA Ushers in Ugadi with Tradition and Timeless Diamond Elegance
ఇది కూడా చదవండి...గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ ఫస్ట్ లుక్ విడుదల – మాస్ అండ్ ఇంటెన్స్ లుక్ అదుర్స్!
దీనిని వెనుక చక్రాల డ్రైవ్‌గా కూడా నడపవచ్చు. డ్రైవింగ్ కోసం నార్మల్, ఎకో అండ్ స్పోర్ట్స్ మోడ్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ SUVని కేవలం 18 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. 15 నిమిషాలు ఛార్జ్ చేసిన తర్వాత దీనిని 343 కిలోమీటర్ల వరకు నడపవచ్చు.
హ్యుందాయ్ ఐయోనిక్5 72.6 kWh సామర్థ్యం గల బ్యాటరీతో అందించారు. 350 kW DC ఫాస్ట్ ఛార్జర్‌ని ఉపయోగించి 10 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయడానికి 18 నిమిషాలు పడుతుంది.
ఈ SUV లోని మోటారు 217 PS శక్తిని,350 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనిలో వెనుక చక్రాల డ్రైవ్ అందించబడింది. సమాచారం ప్రకారం, ఈ SUV ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 631 కి.మీ.లు నడపవచ్చు.
కియా EV6 Vs హ్యుందాయ్ ఐయోనిక్5 ధర..
కియా EV6 రూ. 65.9 లక్షల ఎక్స్-షోరూమ్ ధరకు లాంచ్ చేశారు. హ్యుందాయ్ ఐయోనిక్5 ఎక్స్-షోరూమ్ ధర రూ. 46.5 లక్షలు. landrover.in