Sat. Nov 23rd, 2024
Kia Motors announces complete contactless service initiatives

365తెలుగు డాట్ కామ్,ఆన్ లైన్ న్యూస్,నవంబర్ 16,న్యూఢిల్లీ,2020:భద్రత, సౌకర్యపు నిబద్ధతను విస్తరిస్తూ ఈ దీపావళి వేళ, కియా మోటార్స్‌ కార్పోరేషన్‌కు పూర్తి అనుబంధ సంస్ధ అయిన కియా మోటార్స్‌ ఇండియా తమ వినియోగదారులకు పూర్తిగా స్పర్శ రహిత, పత్ర రహిత అమ్మకం తరువాత సేవలు, వ్యక్తిగతీకరించిన వాహన సేవా యాజమాన్య అనుభవాలను అందించడానికి వాగ్ధానం చేసింది. దీనిలో భాగంగా అడ్వాన్స్‌డ్‌ పికప్‌ , డ్రాప్‌ ప్రోగ్రామ్‌ను సైతం ప్రారంభించారు. ఇది అత్యున్నత వినియోగదారుల భద్రతను నో కాంటాక్ట్‌ పికప్‌ ,డ్రాప్‌ సేవలతో పాటుగా ప్రత్యక్ష వాహనట్రాకింగ్‌ను పూర్తి పేపర్‌ రహిత ప్రక్రియలో అందిస్తుంది. అసాధారణ వాహన యాజమాన్య అనుభవాలను అందిస్తూ, కియా మోటార్స్‌ ఇండియా ఇప్పుడు నూతన ‘మై కన్వీనియెన్స్‌’సేవా కార్యక్రమం సైతం ప్రారంభించింది. ఇది వ్యక్తిగతీకరించిన వాహన నిర్వహణను తమ వినియోగదారులకు అందిస్తుంది. ఈ రెండు కార్యక్రమాలతో, ఈ కంపెనీ ఇప్పుడు అమ్మకం తరువాత అనుభవాలను వ్యక్తిగతీకరించిన , సేవా ప్రక్రియను డిజిటైజింగ్‌ చేయడం ద్వారా వినియోగదారుల అనుభవాలను వృద్ధి చేయనుంది. ఈ వినియోగదారుల లక్ష్యిత యాజమాన్య అనుభవాలు, బ్రాండ్‌ యొక్క అమ్మకం తరువాత సేవల గుర్తింపు అయిన ‘ప్రామిస్‌ టు కేర్‌’ ఆఫరింగ్‌ ను అందించడంతో పాటుగా క్లిష్టత లేని మరియు సౌకర్యవంతమైన యాజమాన్య అనుభవాలను అందిస్తుంది.

Kia Motors announces complete contactless service initiatives
Kia Motors announces complete contactless service initiatives

తై–జిన్‌ పార్క్‌, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అండ్‌ చీఫ్‌సేల్స్‌ ఆఫీసర్‌ మాట్లాడుతూ ‘‘ఈ సంక్షోభ సమయంలో, వినియోగదారుల భద్రత అనేది అత్యంత ప్రాధాన్యత అంశం అయింది. భారతదేశంలో మొట్టమొదటి ఓఈఎంగా పూర్తిగా స్పర్శ రహిత, పేపర్‌ రహిత, అమ్మకం తరువాత ప్రక్రియను పరిచయం చేయడం వల్ల గర్వంగా ఉన్నాము. ఈ దీపావళి వేళ, మా వినియోగదారుల కేంద్రీకృత లక్ష్యంతో, మేము మా వినియోగదారులకు స్పర్శ రహిత, సురక్షిత అమ్మకం తరువాత అనుభవాలను అందించడంతో పాటుగా ప్రస్తుత మార్కెట్‌ ఖాళీలను సైతం పూరిస్తున్నాం. నూతనంగా ఆవిష్కరించిన మై కన్వీనియెన్స్‌ కార్యక్రమం ఈ వాస్తవానికి ప్రతీకగా నిలుస్తుంది. ఇది కేవలం నాణ్యమైన సేవలను అందించడం మాత్రమే కాదు, వ్యక్తిగతీకరించిన వాహన నిర్వహణ కార్యక్రమాన్ని సైతం మా అభిమానులకు అందిస్తుంది. ఈ కార్యక్రమాలతో, అత్యుత్తమ ఉత్పత్తులు మరియు సేవలను మా భారతీయ వినియోగదారులకు అందించాలనే నిబద్ధతను పునరుద్ఘాటిస్తున్నాం’’ అని అన్నారు.

అత్యాధునిక పిక్‌ అండ్‌ డ్రాప్‌ ప్రోగ్రామ్‌:

దక్షిణ కొరియా నేపథ్యమైన ‘అన్‌టాక్ట్‌’ స్ఫూర్తితో ఈ కార్యక్రమం ప్రారంభించారు.అన్‌టాక్ట్‌ అంటే నేరుగా స్పర్శ లేకుండా అనే అర్ధం ఉంది. ఈ కార్యక్రమం ద్వారా పూర్తిగా పత్ర రహిత, స్పర్శ రహిత విధానంలో వాహన పికప్‌ మరియు డ్రాప్‌ సేవలను దీని ద్వారా అందించనున్నారు. ఈ కార్యక్రమాన్ని ఎలాంటి వ్యక్తిగత స్పర్శ లేకుండా పూర్తి సురక్షితంగా మరియు వినియోగదారులకు పరిశుభ్రతను అందించడం లక్ష్యంగా చేసుకున్నారు. ఈ కార్యక్రమం ద్వారా కియా మోటార్స్‌ ఇండియా, ఇప్పుడు దేశంలోని కారు తయారీదారుల నడుమ పూర్తి కాంటాక్ట్‌లెస్‌ అమ్మకం తరువాత ప్రక్రియలను అందిస్తున్న తయారీదారునిగా నిలిచింది. ఈ కార్యక్రమంలో అత్యంత కీలకమైన వైవిధ్యతగా నిలిచే అంశాలు:

డ్రైవర్లు రక్షిత సీటు కవర్‌, ప్రొటెక్షన్‌ కిట్‌ ధరిస్తారు.
సంబంధిత డాక్యుమెంట్లు అయినటువంటి కంపెనీ ఐడీ, డ్రైవర్‌ విజిటింగ్‌ కార్డును పికప్‌కు ముందుగానే వినియోగదారులకు అందిస్తారు. యాప్‌ ఆధారిత పత్ర రహిత సేవల ద్వారా పిక్‌ మరియుడ్రాప్‌ ప్రక్రియలను అందిస్తారు. పలు దశలలో వినియోగదారులకు ఎస్‌ఎంఎస్‌ అలర్ట్స్‌ అందిస్తారు. మ్యాప్‌ ఆధారిత ప్రత్యక్ష వాహన ట్రాకింగ్‌ను వినియోగదారుల కోసం వారి మొబైల్‌ ఫోన్‌పై షెడ్యూల్డ్‌ వాహన పికప్‌ లేదా డ్రాప్‌పై అందిస్తారు.

Kia Motors announces complete contactless service initiatives
Kia Motors announces complete contactless service initiatives

మై కన్వీనియెన్స్‌

తమ వినియోగదారులకు వాహన సర్వీసింగ్‌ ప్రక్రియను మరింతగా వ్యక్తిగతీకరించే ప్రయత్నంలో, కియా మోటార్స్‌ ఇండియా ఇప్పుడు అత్యంత సృజనాత్మక సర్వీస్‌ కార్యక్రమం ‘మై కన్వీనియెన్స్‌’ను తమ అమ్మకం తరువాత గుర్తింపు ‘ప్రామిస్‌ టు కేర్‌’ ద్వారా అందిస్తుంది. ఈ కార్యక్రమాన్ని వినియోగదారులు తమ అవసరాలకు అనుగుణంగా తమ సర్వీసింగ్‌ ప్యాకేజీని వ్యక్తిగతీకరించడానికి అవకాశం కల్పిస్తుంది. దీనితోపాటుగా ఈ కార్యక్రమం ద్వారా ద్రవ్యోల్భణ రక్షణను అందిస్తుంది. అత్యున్నత స్థాయి పారదర్శకత ,ఫ్లెక్సిబిలిటీను వాహన యజమానులకు అందిస్తుంది. ఈ సేవలను పొందడంలో భాగంగా వినియోగదారులు రెండు ఎంపికలను చేసుకోవచ్చు. అందులో మొదటిది ప్రీ పెయిడ్‌మెయిన్‌టెనెన్స్‌ (పీపీఎం) ,రెండవది కేర్‌ ప్యాక్‌ (కార్‌ కేర్‌ సర్వీసెస్‌). తమ నిర్ధిష్టమైన అవసరాలకు అనుగుణంగా వీటిని ఎంచుకోవచ్చు .ప్రీ పెయిడ్‌ మెయిన్‌టెనెన్స్‌ (పీపీఎం):ఈ పీపీఎం కియా అసలైన విడిభాగాలు, ఆయిల్స్‌, లేబర్‌ సేవలను సూచించిన పిరియాడిక్‌ నిర్వహణ షెడ్యూల్‌కు అనుగుణంగా అందిస్తుంది. దీనిని కారు అమ్మకం తేదీ, కారు తిరిగిన కిలోమీటర్ల ఆధారంగా ఇస్తారు. వినియోగదారులు కాంప్లిమెంటరీ సేవలు అయినటువంటి వీల్‌ ఎలైన్‌మెంట్‌, బ్యాలెన్సింగ్‌ , టైర్‌ రొటేషన్‌ను సంవత్సరానికి ఓ మారు ఎంచుకున్న ప్యాకేజీ ప్రాధాన్యతలకనుగుణంగా అందిస్తారు. ఈ ప్యాకేజీ పొందిన వినియోగదారులు, అప్‌ఫ్రంట్‌ పొదుపుతో పాటుగా ద్రవ్యోల్భణం నుంచి ధరల రక్షణను సైతం పొందవచ్చు. ఈ పీపీఎం నాలుగు ప్యాకేజీల రూపంలో వస్తుంది.

Kia Motors announces complete contactless service initiatives
Kia Motors announces complete contactless service initiatives

2సంవత్సరాలు/20వేల కిలోమీటర్లు

3సంవత్సరాలు/30వేల కిలోమీటర్లు

4సంవత్సరాలు/40వేల కిలోమీటర్లు

5సంవత్సరాలు/50వేల కిలోమీటర్లు

  కేర్‌ ప్యాక్‌ (కార్‌ కేర్‌ సర్వీసెస్‌): మై కన్వీనియెన్స్‌సేవల కార్యక్రమంలో మరో ఇతర ముఖ్యమైన అంశం కేర్‌ ప్యాక్‌. దీనిని వినియోగదారుల వ్యక్తిగత అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. కార్‌ ప్యాక్‌లో ఉన్నటువంటి నాలుగు వినూత్న ప్యాకేజీల నుంచి ఒకదానిని వినియోగదారులు ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ ప్యాకేజీలలో ప్రివెంటివ్‌ కేర్‌, ఫ్రెష్‌ కేర్‌, ఏసీ కేర్‌ మరియు హైజీన్‌ కేర్‌ ఉంటాయి. ప్రతి ప్యాకేజీలోనూ రెండు సర్వీసెస్‌ ఉంటాయి. వీటిని వినియోగదారులు తమ సర్వీస్‌ డ్యూరేషన్‌ సమయంలో పొందాల్సి ఉంటుంది. కార్‌ కేర్‌ సర్వీసెస్‌లలో కవర్‌ అయ్యే ప్యాక్‌ల వివరాలు ః

వీటితో పాటుగా, వినియోగదారులు కాంప్లిమెంటరీ అల్లాయ్‌/వీల్‌ కేర్‌ సర్వీస్‌ను , అదనంగా 10% రాయితీని తమ ఇతర కార్‌ కేర్‌ సేవలపై ప్రోగ్రామ్‌ కాల పరిమితిలో పొందవచ్చు. ఈ ప్రోగ్రామ్‌ పొందడానికి వినియోగదారులు ఐదు అంచెల విధానాన్ని కియా ఔట్‌లెట్ల వద్ద సేల్స్‌ , సర్వీస్‌ సమయంలో అనుసరించాల్సి ఉంటుంది. ఏ కియా వాహనం అయినా ఒక సంవత్సరం/10000 కిలోమీటర్ల లోపు ఎప్పుడైనా ఈ కార్యక్రమం ఎంచుకోవచ్చు.

error: Content is protected !!