365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఫిబ్రవరి 15,2025: 2024లో కన్నడలో అత్యధిక వసూళ్లు సాధించిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘మ్యాక్స్’ డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమైంది. మాస్ ఎంటర్‌టైనర్‌గా అలరించిన ఈ చిత్రం ఫిబ్రవరి 15న రాత్రి 7:30 గంటలకు ZEE5లో స్ట్రీమింగ్ కానుంది.
కిచ్చా సుదీప్ ప్రధాన పాత్రలో నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ కన్నడ, తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానుంది.
ఇది కూడా చదవండి..ప్రధాని మోదీ చేతుల మీదుగా సోల్ లీడర్‌షిప్ కాన్‌క్లేవ్ ప్రారంభం.
ఇది కూడా చదవండి..Galaxy F06 5Gని ఆవిష్కరించిన సామ్‌సంగ్..
మ్యాక్స్ మూవీ విశేషాలు: యంగ్ డైరెక్టర్ విజయ్ కార్తికేయ తెరకెక్కించిన ఈ హై-ఆక్టేన్ యాక్షన్ మూవీ కన్నడలో భారీ విజయం సాధించింది. థియేటర్లలో సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేసింది.

పోలీస్ ఇన్‌స్పెక్టర్ అర్జున్ మహాక్షయ్ పాత్రలో కిచ్చా సుదీప్ పర్‌ఫార్మెన్స్ ఆకట్టుకుంది. చట్టానికి అన్యాయం చేసే గ్యాంగ్‌స్టర్లకు ఎదురైన శక్తివంతమైన పోలీస్ కథగా రూపొందిన ఈ సినిమా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది.
ఈ సినిమాలో వరలక్ష్మి శరత్‌కుమార్, సంయుక్త హోర్నాడ్, సుకృతా వాగ్లే, సునీల్, అనిరుధ్ భట్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను కలైపులి ఎస్. థాను (వి క్రియేషన్స్), కిచ్చా సుదీప్ (కిచ్చా క్రియేషన్స్) బ్యానర్లపై నిర్మించారు.
Reliance Consumer Products Acquires Velvette: Reviving an Iconic Indian Brand
ఇది కూడా చదవండి..ఈ ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు మా నాన్న సూపర్ హీరో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ మీ జీ తెలుగులో..!
ZEE5లో స్ట్రీమింగ్‌పై చిత్ర బృందం స్పందన: ZEE5 ప్రతినిధి మాట్లాడుతూ.. “మ్యాక్స్‌ను మా ప్లాట్‌ఫామ్ ద్వారా ప్రేక్షకులకు అందించడం గర్వంగా ఉంది. థియేటర్లలో విజయం సాధించిన ఈ యాక్షన్ డ్రామా డిజిటల్ మాధ్యమంలోనూ అదే ఉత్సాహాన్ని తెస్తుందని ఆశిస్తున్నాం” అన్నారు.
కిచ్చా సుదీప్ మాట్లాడుతూ.. “మ్యాక్స్ థియేటర్లలో అద్భుతమైన స్పందన అందుకుంది. ఇప్పుడు ZEE5 ద్వారా మరింత మంది ప్రేక్షకులకు చేరుతున్నందుకు సంతోషంగా ఉంది. ఇది యాక్షన్, ఎమోషన్, ఇంటెన్స్ డ్రామాతో నిండిన చిత్రం” అని పేర్కొన్నారు.

దర్శకుడు విజయ్ కార్తికేయ మాట్లాడుతూ.. “ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకమైనది. ప్రేక్షకుల్ని థ్రిల్ చేసేలా తెరకెక్కించాలన్న నా ప్రయత్నం ఫలించింది. ఇప్పుడు ZEE5లో స్ట్రీమింగ్ అవ్వడం ఆనందంగా ఉంది” అన్నారు.