365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జనవరి 21,2025: ప్రముఖ ఆభరణాల బ్రాండ్ కిస్నా డైమండ్ & గోల్డ్ జ్యువెలరీ, సత్తెనపల్లిలోని శ్రీశివ శంకర జ్యువెలరీ మార్ట్‌లో “షాప్ అండ్ విన్ కార్” ఆఫర్ విజేతను ప్రకటిస్తూ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ లక్కీ డ్రా కార్యక్రమానికి కస్టమర్ల నుండి విశేష స్పందన లభించింది.

ఈ సందర్భంగా ప్రధాన బహుమతి గెలుచుకున్న అదృష్టవంతురాలు గుంటూరులోని శ్రీలక్ష్మీ జ్యువెలర్స్ నుంచి కొనుగోలు చేసిన శ్రీమతి శ్వేత అని ప్రకటించారు. ఆమెకు కొత్త కారును బహుమతిగా అందజేశారు.

రిటైల్ భాగస్వామి శ్రీలక్ష్మీ జ్యువెలర్స్ అధినేత జె.వి. సబ్బారావు మాట్లాడుతూ, “కిస్నాతో మేము భాగస్వామ్యం చేసుకున్న ఈ ప్రయాణం మాకు గర్వకారణం. మా కస్టమర్ల ఆనందాన్ని చూసి చాలా సంతోషం కలిగింది. ఈ విజేతకు అభినందనలు తెలుపుతూ, భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలను నిర్వహించడానికి ఎదురుచూస్తున్నాం” అని అన్నారు.

హరి కృష్ణ గ్రూప్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ ఘనశ్యామ్ ధోలాకియా ఈ సందర్భంగా మాట్లాడుతూ, “మా కస్టమర్ల ప్రేమకు, నమ్మకానికి ఈ ‘షాప్ అండ్ విన్ కార్’ పోటీ ఒక కృతజ్ఞతా చిహ్నం. గ్రాండ్ ప్రైజ్ గెలుచుకున్న శ్రీమతి శ్వేతకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ పోటీలో ఉత్సాహంగా పాల్గొన్న ప్రతి కస్టమర్‌కు మా ధన్యవాదాలు” అని తెలిపారు. https://kisna.com

కిస్నా డైమండ్ అండ్ గోల్డ్ జ్యువెలరీ డైరెక్టర్ పరాగ్ షా మాట్లాడుతూ, “మా కస్టమర్ల జీవితాల్లోకి ఆనందాన్ని తీసుకువచ్చే కార్యక్రమాలు నిర్వహించటం మాకు ఎంతో ఆనందంగా ఉంది. వారి విశ్వాసానికి, మద్దతుకు కృతజ్ఞులం. భవిష్యత్తులో మా కస్టమర్లకు మరిన్ని అద్భుతమైన అనుభవాలను అందించడానికి కట్టుబడి ఉన్నాం” అని అన్నారు. https://kisna.com