Tue. Dec 24th, 2024
Doctorate: ఇస్రో చైర్మన్‌ శివన్‌, నటుడు ఆలీకి గౌరవ డాక్టరేట్‌ ప్రదానం | KL Deemed  to be University hosts its 11th Convocation; 3,650 students receive graduate,  post graduate and doctorate degrees | TV9 Telugu

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,18 డిసెంబర్‌, 2021,ఇండియా: గ్రాడ్యుయేషన్‌,ఉన్నత విద్య కోసం దేశంలో సుప్రసిద్ధ యూనివర్శిటీలలో ఒకటిగా వెలుగొందుతున్న కె ఎల్‌ డీమ్డ్‌ టు బీ యూనివర్శిటీ తమ 11వ స్నాతకోత్సవంను నిర్వహించింది. తమ ఉన్నత విద్యను విజయవంతంగా పూర్తి చేసిన 3650 మంది గ్రాడ్యుయేటింగ్‌ విద్యార్థుల విజయాన్ని వేడుక చేస్తూ ఈ స్నాతకోత్సవం నిర్వహించారు. అండర్‌ గ్రాడ్యుయేటెడ్‌ కోర్సులలో బీటెక్‌, బీకామ్‌, బీబీఏ, బీసీఏ, బీఎస్‌సీ, బీఏ, బీఫార్మా, బీబీఏ–ఎల్‌ఎల్‌బీ,పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులలో ఎంటెక్‌, ఎంబీఏ, ఎంఎస్‌సీ, ఎంఏ వంటివి ఉన్నాయి. క్యాంపస్‌లో నిర్వహించిన ఈ స్నాతకోత్సవంలో గ్రాడ్యుయేట్స్‌తో పాటుగా వారి తల్లిదండ్రులు, మెంటార్లు పాల్గొన్నారు. ఈ వాతావరణమంతా ఆనందాశ్చర్యాలు, కృతజ్ఞతా పూర్వక సంభాషణలతో నిండిపోయింది.

ఈ గంభీరమైన సమ్మేళనంలో ఏరోస్పేస్‌, ఆటోమొబైల్‌, వినోద పరిశ్రమల నుంచి సుప్రసిద్ధ వ్యక్తులు పాల్గొన్నారు. ఈ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా డాక్టర్‌ కె శివన్‌, ఛైర్మన్‌, ఇస్రో, సెక్రటరీ,డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ స్పేస్‌, భారత ప్రభుత్వం పాల్గొన్నారు. ఇతర గౌరవ అతిథులలో శ్రీ కమల్‌ బాలీ, అధ్యక్షులు మరియు ఎండీ, వోల్వో గ్రూప్‌, ఇండియా,బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు, విశ్వ విఖ్యాత ప్రవచనకర్త ;మొహమ్మద్‌ అలీ, సినీ నటుడు,కూచిభొట్ల ఆనంద్‌, ఫౌండర్‌, సిలికాన్‌ ఆంధ్ర, యుఎస్‌ఏ లు పాల్గొన్నారు.

KL Deemed-to-be University hosts its 11th Convocation; 3,650 students  receive graduate, post-graduate and doctorate degrees | Business News This  Week

కెఎల్‌ డీమ్డ్‌ టు బీ యూనివర్శిటీ ఛాన్స్‌లర్‌ డాక్టర్‌ ఎస్‌ఎస్‌ మంత మొత్తం మీద 3525 మంది గ్రాడ్యుయేట్‌,పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ విద్యార్ధులతో పాటుగా 125 డాక్టోరల్‌ డిగ్రీలు (పీహెచ్‌డీ)లను అందజేశారు. ప్రతి ప్రోగ్రామ్‌లోనూ స్పెషలైజేషన్‌లో అత్యున్నత ర్యాంకులు సాధించిన విద్యార్థులలో 40 మందికి బంగారు పతకాలు,ద్వితీయ స్థానంలో నిలిచిన విద్యార్థులకు 40 వెండి పతకాలను అందించారు.డాక్టర్‌ కె శివన్‌ ,కమల్‌ బాలీకి గౌరవ డిగ్రీను డాక్టర్‌ ఆఫ్‌ సైన్స్‌ (హానరిస్‌ కాసా) అందజేశారు.

మొహమ్మద్‌ అలీ, సినీ నటుడు ;కూచిభొట్ల ఆనంద్‌, ఫౌండర్‌, సిలికాన్‌ ఆంధ్ర, యుఎస్‌ఏ, బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు, విశ్వ విఖ్యాత ప్రవచన కర్తలకు గౌరవ డిగ్రీలను హానరరీ డిగ్రీ ఆఫ్‌ డాక్టర్‌ ఆఫ్‌ లెటర్స్‌ (హానోరిస్‌ కాసా)గా అందించింది.
స్నాతకోత్సవ ప్రసంగం చేసిన కోనేరు సత్యనారాయణ, అధ్యక్షుడు, కెఎల్‌ డీమ్డ్‌ టు బీ యూనివర్శిటీ మాట్లాడుతూ ఆవిష్కరణల ద్వారా పూర్తి ఆత్మవిశ్వాసంతో ఈ ప్రపంచానికి నేతృత్వం వహించాల్సిందిగా విద్యార్థులకు ఉద్భోదించారు.ఆయన మాట్లాడుతూ ‘‘యూనివర్శిటీ విద్యార్థులు తమ జీవన వారసత్వపు ప్రతీకలు, మహమ్మారి వేళలో తీవ్ర ఒత్తిడిలో కూడా వారు సాధించిన విజయానికి ఓ విద్యావేత్తగా గర్విస్తున్నాను.యూనివర్శిటీగా మనమంతా మరోమారు కలిసి రావడంతో పాటుగా మా విద్యార్థుల అపూర్వమైన విజయాలు,పురోగతిని వేడుక చేసేందుకు అనువైన సమయం కోసం నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’’ అని అన్నారు.

2,600 students receive degrees Convocation ceremony of KL deemed university  - Times of India

గ్రాడ్యుయేట్లను ఉద్దేశించి డాక్టర్‌ కె శివన్‌, ఛైర్మన్‌, ఇస్రో ; సెక్రటరీ, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ స్పేస్‌ మాట్లాడుతూ ‘‘గ్రాడ్యుయేటింగ్‌ విద్యార్ధులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను,భవిష్యత్‌ను వారు విప్లవాత్మకంగా మార్చాలని కోరుకుంటున్నాను. ఈ మహమ్మారి ఔత్సాహిక నాయకులకు, స్దిరంగా ఉండే అవకాశాన్ని అందించడంతో పాటుగా సవాళ్లను సైతం ధీటుగా ఎదుర్కొనేందుకు తగిన సంసిద్ధతను అందించింది. ఆర్‌అండ్‌ డీకి సంబంధించి సరైన వసతులు కలిగిన కెఎల్‌ లాంటి యూనివర్శిటీలతో, ఆవిష్కరణలు,వృద్ధికి అసలైన అవకాశాలు కలుగుతాయి.యూనివర్శిటీ నాటిన ఈ విత్తనాలు మొలకెత్తడాన్ని చూడాలని ఆసక్తిగా నేను చూస్తున్నాను’’ అని అన్నారు.

డాక్టర్‌ జి.పార్ధ సారధి వర్మ, వైస్‌ ఛాన్స్‌లర్‌, కెఎల్‌ డీమ్డ్‌ టు బీ యూనివర్శిటీ స్నాతకోత్సవ నివేదికను సమర్పించారు. గత సంవత్సర కాలంలో యూనివర్శిటీ ప్రయాణాన్ని ఆయన ప్రేక్షకుల కళ్లముందుంచారు. ఈ యూనివర్శిటీ తమ ప్రతిభ, మౌలిక వసతులు, మెంటార్‌షిప్‌ కారణంగా జాతీయ, అంతర్జాతీయ గుర్తింపును అందుకుంది. గత కొద్ది సంవత్సరాలలో ఇది 30వేల మంది విద్యార్థులకు డిగ్రీలను అందించింది.

బీటెక్‌ మెకానికల్‌ ఇంజినీరింగ్‌లో ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించడంతో పాటుగా డాక్టర్‌ ఏ సీ రావు మెమోరియల్‌ గోల్డ్‌ మెడల్‌ అందుకున్న ఈ మరుపురాని దినం గురించి జల్లెల ఈశ్వర్‌ సింగ్‌ మాట్లాడుతూ ‘‘ ఇక్కడకు రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నేను అభిమానించే నా కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ డిగ్రీని అందుకోవడం, మరీ ముఖ్యంగా నేను అభిమానించే యూనివర్శిటీలో నేను గౌరవించే మెంటార్ల సమక్షంలో ఈ గుర్తింపు పొందడం ఓ గౌరవంగా భావిస్తున్నాను.

మహమ్మారి కాలంలో ఎదుర్కొన్న కష్టాలన్నీ ఇప్పుడు మటుమాయమయ్యాయని నేను భావిస్తున్నాను. మా కెరీర్‌లను గురించి ఇప్పుడు ఉత్సుకతతో చూస్తున్నాను. కానీ ఇప్పుడు మాత్రం, ఈ యూనివర్శిటీలో మేము సృష్టిచుకున్న మధురస్మృతులు, మేము నిరుత్సాహ పడినప్పుడు మా మెంటార్‌లు అందించిన స్ఫూర్తిని నెమరవేసుకోవాలనుకుంటున్నాను’’ అని అన్నారు.‘‘నేడు ఇక్కడకు హాజరైన ప్రతి తల్లిదండ్రికి ఇది గర్వకారణమైన క్షణం. ఇక్కడ వారు తమ పిల్లలకు మద్దతునందించడం కోసం మాత్రమే రాలేదు. కానీ, విద్యార్థుల విజయాలు, ఆవిష్కరణలు,అంకిత భావంతో మహమ్మారిని ధైర్యంగా అధిగమించిన విద్యార్థుల విజయాలను వేడుక చేసుకోవడానికి వచ్చారు’’ అని ఎంటెక్‌ సీఆర్‌ఎస్‌ గోల్డ్‌ మెడలిస్ట్‌ కృష్ణ జగుపిల్ల మాతృమూర్తి శ్రీమతి కనకదుర్గ జగుపిల్ల అన్నారు.

ఈ గ్రాడ్యుయేటింగ్‌ బ్యాచ్‌ నుంచి తామెంతగానో ఆశిస్తున్నట్లు యూనివర్శిటీ తెలుపడంతో పాటుగా నేడు లభిస్తున్న అపూర్వ అవకాశాల వేళ అత్యుత్తమ విజయాలను వారు సాధించాలని ఆకాంక్షించింది.

error: Content is protected !!