TTD_koilalwar

365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుమల, ఫిబ్రవరి 7,2023: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం వేడుకగా జరిగింది. ఫిబ్రవరి11తేదీ నుంచి 19వ తేదీ వరకు ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి.

ఉదయం 6.30 నుంచి11గంటల వరకు ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంతోపాటు గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు,

శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు.

TTD_koilalwar

రెండు పరదాలు విరాళం.. ఈ సందర్భంగా తిరుపతికి చెందిన శ్రీ పరదాల మణి రెండు పరదాలు, రెండు కురాళాలను ఆలయానికి విరాళంగా అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేకశ్రేణి డెప్యూటీ ఈఓ వరలక్ష్మీ, ఏఈవో గురుమూర్తి, ప్రధానార్చకులు బాలాజి రంగాచార్యులు, సూపరింటెండెంట్ ముని చెంగల్రాయలు, టెంపుల్ ఇన్స్ పెక్టర్ కిరణ్ కుమార్, ఆర్జితం ఇన్స్ పెక్టర్ ధనశేఖర్ తదితరులు పాల్గొన్నారు.