365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి,ఫిబ్ర‌వ‌రి 15,2022: శ్రీనివాసమంగా పురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మంగ‌ళ‌వారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జ‌రిగింది. కోవిడ్‌-19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ఏకాంతంగా ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఆలయంలో ఫిబ్రవరి 20 నుంచి 28వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా జరగనున్నాయి. ఈ ఉత్స‌వాల‌కు ముందు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.

ఈ సందర్భంగా తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు నిర్వహించారు. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం చేప‌ట్టారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :తేదీ ఉదయం సాయంత్రం

20-02-2022(ఆదివారం) ధ్వజారోహణం(మీన‌ల‌గ్నం) పెద్దశేష వాహనం

21-02-2022(సోమ‌వారం) చిన్నశేష వాహనం హంస వాహనం

22-02-2022(మంగ‌ళ‌వారం) సింహ వాహనం ముత్యపుపందిరి వాహనం

23-02-2022(బుధ‌వారం) కల్పవృక్ష వాహనం సర్వభూపాల వాహనం

24-02-2022(గురువారం) పల్లకీ ఉత్సవం(మోహినీ అవతారం) గరుడ వాహనం

25-02-2022(శుక్ర‌వారం) హనుమంత వాహనం స్వర్ణరథం(తిరుచ్చి), గజ వాహనం

26-02-2022(శ‌నివారం) సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం

27-02-2022(ఆదివారం) రథోత్సవం(సర్వభూపాల వాహనం) అశ్వవాహనం

28-02-2022(సోమ‌వారం) చక్రస్నానం ధ్వజావరోహణం