
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఆంధ్ర ప్రదేశ్,సెప్టెంబర్21,2021: శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్లను సినీ హీరో రామ్ చరణ్ సతీమణి ఉపాసన దర్శించుకున్నరు. వీరికి శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి కుమార్తె బియ్యపు పవిత్ర రెడ్డి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం దక్షిణామూర్తి వద్ద వేదపండితులచే ఆశీర్వాదం చేయించి స్వామి అమ్మవార్ల తీర్థప్రసాదాలు అందించారు.