365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ఏప్రిల్ 3, 2023: తెలంగాణాప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రేని భద్రాద్రి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, భద్రాచలం శాసనసభ్యులు పొదెం వీరయ్య వీరయ్య ఆదివారం హైదరాబాద్ లో మర్యాదపూర్వకంగా పినపాక నియోజకవర్గ యువ నేత బట్టా విజయ్ గాంధీతో పాటు కలిశారు.
ఈ సందర్భంగా జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతంకు నాయకులు చేస్తున్న కృషిని వివరించారు. జిల్లాలోని పినపాక నియోజకవర్గంలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలను కొందరు డీసీసీ పై సామాజిక మాధ్యమాల్లో కావాలని చేస్తున్న దుష్ప్రచారాలను వాటిని నిరోధించేందుకు ఆయన తీసుకుంటున్న చర్యలను మాణిక్ రావ్ థాక్రే దృష్టికి తీసుకెళ్లారు.
ఈ కార్యక్రమంలో మాజీ కేంద్రమంత్రి బలరాం నాయక్, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెన్నం శ్రీకాంత్ రెడ్డి, కొత్తగూడెం నియోజకవర్గ నాయకులు నాగ సీతరాములు తదితరులు పాల్గొన్నారు.