Mon. Dec 16th, 2024
amuktamalyada-365

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఫిబ్రవరి19, 2023: హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో శనివారం ప్రదర్శించిన కూచిపూడి నృత్య నాటకం ఆముక్తమాల్యద అందరినీ ఆకట్టుకుంది.

ఆముక్తమాల్యద ఈ శీర్షికే ప్రతి తెలుగు సాహిత్యాభిమానిలో గర్వాన్ని రేకెత్తిస్తుంది. కవిరాజు శ్రీకృష్ణదేవరాయల గొప్ప సామ్రాజ్యంతో పాటు ఆయన చైతన్యవంతమైన వ్యక్తిత్వం ద్వారా సాగిన సాహిత్య, సామాజిక, సాంస్కృతిక, మత ప్రవాహాల ఏకీకృత సమ్మేళనానికి ఇది ప్రాతినిధ్యం వహిస్తుంది.

దాని ప్రధాన కథనంలో ఆండాళ్ – గోదాదేవి కథ, రంగనాథునిపై ఆమెకున్న అపరిమితమైన ప్రేమ ఇమిడి ఉంది. క్రీస్తుశకం 6 – 7మధ్య శతాబ్దంలో భక్తి ఉద్యమం ఉచ్ఛస్థితిలో ఉన్నప్పుడు గోదాదేవి కథ సాగుతుంది. భక్తి కవయిత్రిగా, ఆ కోవలోని తొలి మహిళగా గుర్తింపు పొంది.. దేవత స్థాయికి ఎదిగారు ఆమె.

amuktamalyada-365

12 మంది ఆళ్వార్లలో ఏకైక మహిళా ఆళ్వార్ గా, యోగ, దైవిక ప్రేమరంగంలో స్త్రీ స్వరానికి ప్రాముఖ్యత ఇచ్చింది. ఇది ఆమె రచనలైన నాచియార్ తిరుమొళి, తిరుప్పావై ద్వారా నిరూపితమైంది.

ఈ కూచిపూడి నృత్యనాటకం ఆముక్తమాల్యద అనే కవితా సంకలనం అనుసరణ. దీనికి గురు శ్రీమతి బాలా త్రిపుర సుందరి నృత్యరీతులు సమకూర్చారు. ఆమె తన తండ్రి, గురువు డాక్టర్ వెంపటి చినసత్యం వద్ద చిన్నతనం నుంచి ఆయనను గమనిస్తూ నాట్యవిద్య నేర్చుకున్నారు.

నాట్యశాస్త్రంలోని అంశాలను ఉపయోగించి, తనదైన శైలిలో ఎన్నో పాటలకు కొరియోగ్రఫీ చేశారు. ఆముక్తమాల్యద అనే నృత్య నాటకంలో ఆమె శైలిని చూడవచ్చు. ఇది ఆమె మొదటి నృత్య నాటక కూర్పు.

ఆమె ఇంతకు ముందు రచించిన రచనలు – పాహి పాహి బాల గణపతే, మతే మలయధ్వజ – ఖమాస్ వర్ణం, సాంబ శివాయనవే – ఖమాస్ స్వరాజ్యతి, తిల్లానా – ఫరాజు, మొదలైనవి.

అందులో “మాతే వర్ణం” ఈనాటి కూచిపూడిలో అత్యంత ప్రామాణికమైన నృత్యరీతులలో ఒకటి.

amuktamalyada-365

డాక్టర్ టి.కె.చూడామణి స్క్రిప్ట్ వర్క్ చేయగా, డాక్టర్ టి.కె.సరోజ సంగీతం అందించారు. డాక్టర్ యశోదా ఠాకూర్ సలహాదారుగా, కన్సల్టెంట్ ఆర్టిస్ట్ గా సేవలందించారు. కవర్ ఆర్ట్ ను కృష్ణ నుంచి కేశవ్ గీశారు.

7 అధ్యాయాలలో 873 శ్లోకాలతో ఆముక్తమాల్యద కావ్యం ఎంతో మంది పండితులను దాని విశిష్ట సాహిత్యాన్ని పరిశోధించడానికి, అధ్యయనం చేయడానికి ప్రేరేపించింది. వాటిలో ఒకటి ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి ఈ కావ్యం పరిశోధన, అనువాదం. అదే ఈ ప్రాజెక్టుకు మార్గనిర్దేశం చేసింది.

అభినయ వాణి నృత్య నికేతన్ విద్యార్థులు, పలువురు స్వతంత్ర కళాకారులు, పలువురు సంగీత విద్వాంసులు, ఇతర సాంకేతిక నిపుణులు కలిసి ఈ అద్భుత దృశ్యాన్ని ప్రదర్శించారు.

error: Content is protected !!