365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, మార్చి 23,2025:మలయాళ సూపర్‌స్టార్, కంప్లీట్ యాక్టర్ మోహన్‌లాల్, పృథ్వీరాజ్‌ సుకుమారన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన భారీ చిత్రం ‘L2E: ఎంపురాన్’. ఆశీర్వాద్ సినిమాస్, శ్రీ గోకులం మూవీస్ బ్యానర్లపై ఆంటోనీ పెరుంబవూర్, గోకులం గోపాలన్ నిర్మించారు.

మురళీ గోపి కథ అందించగా, ఈ చిత్రానికి పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించారు. మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా మలయాళంతో పాటు తెలుగు, హిందీ, తమిళ, కన్నడ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో గురువారం ఈ మూవీ ట్రైలర్‌ను ఐమ్యాక్స్ ఫార్మాట్‌లో విడుదల చేశారు.

Read this also…“It’s Not a Film; It’s Magic” – Mohanlal on the Grand Trailer Launch of L2E: Empuraan in Mumbai

ఇది కూడా చదవండియుకే హౌస్ ఆఫ్ కామన్స్‌లో ప్రతిష్ఠాత్మక గౌరవం – మెగాస్టార్ చిరంజీవి హృదయపూర్వక స్పందన..

Read this also…“Heart Filled with Gratitude”: Megastar Chiranjeevi Reacts on Prestigious Honour at the House of Commons in the United Kingdom

ఈ సందర్భంగా మోహన్‌లాల్ మాట్లాడుతూ.. “‘L2E: ఎంపురాన్’ మా కోసం ఓ మరపురాని జర్నీ. పాన్ ఇండియా సినిమా చేయాలన్న మా ప్రయాణం ఏడేళ్లుగా సాగుతోంది. ‘L2E: ఎంపురాన్’ను అత్యద్భుతంగా తెరకెక్కించిన పృథ్వీరాజ్‌కి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈ సినిమాను కేవలం సినిమా అనడం కన్నా మా చెమట, మా శ్రమ అని చెప్పాలి.

ఇది ట్రయాలజీ మూవీ. మొదట లూసిఫర్, ఇప్పుడు ఎంపురాన్.. తరువాతి భాగం త్వరలో. మలయాళ ఇండస్ట్రీ నుంచి తొలిసారిగా ఓ ఐమ్యాక్స్ ఫార్మాట్ మూవీ రావడం గర్వంగా ఉంది. ఈ సినిమాను ప్రేక్షకులతో కలిసి థియేటర్‌లో ఆస్వాదించాలనుకుంటున్నాను” అన్నారు.

దర్శకుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్ మాట్లాడుతూ.. “ఓ సినిమాను తెరకెక్కించడం చిన్న విషయమే కానీ, ‘L2E: ఎంపురాన్’ లాంటి భారీ ప్రాజెక్ట్ చేయడం చాలా సవాల్‌తో కూడుకున్న పని. లూసిఫర్ తర్వాత ఈ సినిమాను మలయాళం మాత్రమే కాకుండా పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందించాలన్న ఆలోచన నాకు 2022లో మొదలైంది.

మోహన్‌లాల్‌గారికి స్టోరీ నేరేషన్ ఇచ్చినప్పుడు ఇది సాధ్యమయ్యే అవకాశాలు తక్కువగానే అనిపించాయి. కానీ లాల్ సార్ కథ విని వెంటనే ‘మనమిద్దరం ఈ సినిమా చేస్తున్నాం’ అని చెప్పడం నాకెంతో ఆత్మవిశ్వాసం ఇచ్చింది.

నిర్మాతలు ఆంటోనీ పెరుంబవూర్, గోకులం గోపాలన్ మా సినిమాపై నమ్మకంతో భారీ స్థాయిలో నిర్మించారు. దేశంలోని ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ అనీల్ తడాని ముందుకు రావడంతో ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమంగా ప్రేక్షకులకు అందించగలిగాం” అన్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ విడుదల చేయగా.. కర్ణాటకలో హోంబలే ఫిల్మ్స్, తమిళనాడులో శ్రీ గోకులం మూవీస్ రిలీజ్ చేయనున్నాయి.

ఈ వేడుకలో ఏఏ ఫిల్మ్స్ అధినేత అనీల్ తడాని, నిర్మాత గోకులం గోపాలన్, రైటర్ మురళీ గోపి, మంజు వారియర్, నటుడు ఇంద్రజిత్ తదితరులు పాల్గొన్నారు.