365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,డిసెంబర్ 2,2024: తెలంగాణలో మరో పరువు హత్య చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో హయత్ నగర్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న లేడీ కానిస్టేబుల్ నాగమణిని, ఆమె సొంత తమ్ముడు ప్రసాద్ హత్య చేశాడు.

ఈ సంఘటన మరింత కలకలం రేపుతుంది. నాగమణి ఇటీవల కులాంతర వివాహం చేసుకున్న కారణంగా ఆమె కుటుంబ సభ్యులు ఆమెపై ఆగ్రహంతో ఉన్నారు. ఆమె తనకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకోవడంతో ఆమె కుటుంబంలో విభేదాలు మొదలయ్యాయి.

సోమవారం ఉదయం, నాగమణి డ్యూటీకి వెళ్ళిపోతుండగా, ఆమెను ఆమె సొంత తమ్ముడు ప్రసాద్ రాయపోలు-ఎండ్లగూడ రోడ్డు మార్గంలో కారుతో ఢీకొట్టి, తరువాత కత్తితో మెడపై నరికి హత్య చేశాడు. ఈ దారుణ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.