Sun. Dec 1st, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, నవంబర్ 18,2024: నగరంలోని చెరువులను పరిరక్షించడం మాత్రమే కాదు, వాటి కాలుష్యాన్ని నివారించడానికి కూడా హైడ్రా కృషి చేస్తోంది.

చెరువులను భౌగోళికంగా కాపాడడమే కాకుండా, వాటిని పర్యావరణ హితంగా తీర్చిదిద్దే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా, పర్యావరణ పరిరక్షణలో పీసీబీతో కలసి పని చేయాలని నిర్ణయించారు.

సోమవారం, పీసీబీ కార్యాలయంలో పీసీబీ సభ్య కార్యదర్శి జి. రవి, హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ మధ్య సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో పీసీబీ, హైడ్రా అధికారులు పాల్గొన్నారు.

చెరువుల పరిరక్షణకు సంబంధించిన లక్ష్యాలను వివరించిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలకు గురి కాకుండా కాపాడడం, వరద నీటి కాలువలు, ప్రజావసరాల కోసం కేటాయించిన స్థలాలను పరిరక్షించడం గురించి చర్చించారు.

పీసీబీ పని విధానం వివరించిన పీసీబీ సభ్య కార్యదర్శి జి. రవి.

చెరువుల్లో మురుగు, పారిశ్రామిక వ్యర్థాలు, కాలుష్యం రాకుండా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.

పారిశ్రామిక వ్యర్థాలు కాలువల్లో డంప్ చేయకుండా, గట్టి నిఘా పెట్టడానికి సమష్టిగా పని చేయాలని పీసీబీ, హైడ్రా అధికారులు నిర్ణయించారు.

చెరువులలో, కాలువల్లో పారిశ్రామిక వ్యర్థాలు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి ప్రత్యేక మాపక యంత్రాలతో నిఘా పెట్టాలని నిర్ణయించారు.

పారిశ్రామిక వర్గాలతో సమావేశం నిర్వహించి, పీసీబీ నిబంధనలను కఠినంగా అమలు చేయించేందుకు అవగాహన కల్పించాలన్న దిశలో చర్యలు తీసుకోవడం.

స్థానిక నివాసితులు, పర్యావరణ వేత్తలు, విద్యార్థుల సహకారంతో చెరువుల పరిరక్షణ కమిటీలను ఏర్పాటు చేయడం, కాలుష్యాన్ని అరికట్టే చర్యలు తీసుకోవడం.

ఇప్పటికే నమోదైన కేసులు మరియు ఫిర్యాదులను పరిగణలోకి తీసుకొని, వాటిపై లోతైన విచారణ చేపట్టడం.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశంలో, భవిష్యత్తు తరాలకు మంచి జీవన ప్రమాణాలు అందించేందుకు ఇరు విభాగాలు సమన్వయంతో కలసి పనిచేయాలని నిర్ణయించారు.

error: Content is protected !!