365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, డిసెంబర్ 18,2023:మూడు సెషన్ల వరుస లాభాలకు తెరపడింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం నష్టాల్లో ముగిశాయి. బ్యాంకు, ఎఫ్ఎంసీజీ, ఐటీ షేర్లు ఎరుపెక్కడమే ఇందుకు దోహదం చేసింది. ఇప్పటికే సూచీలు జీవితకాల గరిష్ఠాలకు చేరడంతో మదుపర్లు అప్రమత్తంగా ఉంటున్నారు.

లాభాల స్వీకరణకు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా కరెక్షన్ జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇక బ్యాంక్ ఆఫ్ జపాన్ మీటింగ్, యూకే ద్రవ్యోల్బణం డేటా గురించి మార్కెట్ వర్గాలు ఆసక్తిగా ఉన్నాయి.

ముడిచమురు సరఫరాకు అంతరాయాలు ఏర్పడటం నెగెటివ్ సంకేతాలు ఇచ్చింది. నేడు ఆసియా, ఐరోపా సూచీలు తగ్గాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 6 పైసలు బలహీనపడి 83.06 వద్ద స్థిరపడింది.

క్రితం సెషన్లో 71,483 వద్ద ముగిసిన బీఎస్ఈ సెన్సెక్స్ నేడు 71,437 వద్ద మొదలైంది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో 71,552 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. ఆపై క్రమంగా తగ్గి 71,142 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది.

మొత్తంగా 168 పాయింట్ల నష్టంతో 71,315 వద్ద ముగిసింది. సోమవారం 21,434 వద్ద ఆరంభమైన ఎన్ఎస్ఈ నిఫ్టీ 21,482 వద్ద గరిష్ఠాన్ని అందుకుంది. 21,365 వద్ద కనిష్ఠాన్ని తాకిన సైచీ చివరికి 38 పాయింట్లు ఎరుపెక్కి 21,418 వద్ద క్లోజైంది. నిఫ్టీ బ్యాంకు 275 పాయింట్లు తగ్గి 47,867 వద్ద ముగిసింది.

నిఫ్టీ50లో 16 కంపెనీలు లాభపడగా 34 నష్టపోయాయి. బజాజ్ ఆటో, హిందాల్కో, సన్ ఫార్మా, అదానీ పోర్ట్స్, రిలయన్స్ టాప్ గెయినర్స్. పవర్ గ్రిడ్, ఐటీసీ, టెక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంకు, జేఎస్‌డబ్ల్యూస్టీల్ టాప్ టాసర్స్.

నేడు మీడియా, ఫార్మా, హెల్త్‌కేర్, కన్జూమర్ డ్యురబుల్స్ సూచీలు కళకళలాడాయి. బ్యాంకు, ఫైనాన్స్, ఎఫ్ఎంసీజీ, ఐటీ, పీఎస్‌యూ బ్యాంకు, ప్రైవేటు బ్యాంకు, రియాల్టీ సూచీలు ఎక్కువ ఎరుపెక్కాయి.

నిఫ్టీ డిసెంబర్ ఫ్యూచర్స్ సపోర్టు 21,450, రెసిస్టెన్సీ 21,600 వద్ద ఉన్నాయి. ఇన్వెస్టర్లు స్వల్ప కాలానికి అంబుజా సిమెంట్స్, హెచ్‌సీఎల్ టెక్, ఏసీసీ, ఎంజీఎల్, అదానీ పోర్ట్ షేర్లను కొనొచ్చు.

నేడు నిఫ్టీ సూచీ తగ్గడంలో ఐసీఐసీఐ బ్యాంకు, ఇన్ఫోసిస్, ఐటీసీదే కీలక పాత్ర. రిలయన్స్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ షేర్లు జీవితకాల గరిష్ఠానికి చేరాయి. శుక్రవారం రూ.1181 వద్ద ముగిసిన షేరు నేడు రూ.1340 వరకు పెరిగింది.

అదానీ పోర్ట్స్ షేర్లు సైతం దూసుకెళ్లాయి. రూ.1102 వద్ద సరికొత్త గరిష్ఠాన్ని అందుకున్నాయి. రూ.844 వద్ద ఐఆర్‌సీటీసీ షేర్లు 21 నెలల గరిష్ఠాన్ని తాకాయి. డిసెంబర్ 7న సాంకేతిక తప్పిదంతో లెక్కి తప్పిన రూ.705 కోట్లను యూకో బ్యాంకు రికవరీ చేసింది.

హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌తో కరూర్ వైశ్యా బ్యాంకు ఒప్పందం కుదుర్చుకుంది. సుందర్ మాంగనీస్ షేర్లు 10 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకాయి. యెస్ బ్యాంకు షేర్లు 52 వారాల గరిష్ఠాన్ని తాకాయి.

  • మూర్తి నాయుడు పాదం
    నిఫ్ట్ మాస్టర్
    స్టాక్ మార్కెట్ అనలిస్ట్
    +91 988 555 9709.