365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,మే 26,2023: దేశీయ సూచీలు శుక్రవారంలాభాల్లో ప్రారంభ మయ్యాయి. NSE నిఫ్టీ 50 29.75 పాయింట్లు లేదా 0.16% పెరిగి 18,350.90 వద్ద, BSE సెన్సెక్స్ 130.58 పాయింట్లు అంటే 0.21% పెరిగి 62,003.20 వద్దకు చేరుకుంది. సెక్టోరల్ ఇండెక్స్‌లలో, బ్యాంక్ నిఫ్టీ 52.65 పాయింట్లు లేదా 0.12% పడిపోయి 43,628.75 వద్ద , నిఫ్టీ IT 167.30 పాయింట్లు లేదా 0.58% జంప్ చేసి 29,096.05 వద్దకు చేరుకుంది.
నిఫ్టీ 50లో అదానీ ఎంటర్‌ప్రైజెస్, ఎన్‌టీపీసీ, బజాజ్ ఫిన్‌సర్వ్, మహీంద్రా అండ్ మహీంద్రా,టెక్ మహీంద్రా టాప్ లాభాల్లో ఉండగా, ఐషర్ మోటార్స్, పవర్ గ్రిడ్, గ్రాసిమ్, సన్ ఫార్మా ,యాక్సిస్ బ్యాంక్ లు నష్టపోయాయి.

వారం చివరి ట్రేడింగ్ రోజు స్టాక్ మార్కెట్ పెరుగుదలతో ప్రారంభమైంది, అయితే ఈ సమయంలో ప్రపంచ మందగమనం ప్రభావం మార్కెట్‌పై కూడా కనిపించింది.
SGX నిఫ్టీ శుక్రవారం ఉదయం రెడ్ మార్క్‌లో ట్రేడవుతోంది, ఇది 18400 దగ్గర ట్రేడవుతోంది. US ఫ్యూచర్స్ మార్కెట్లలో కూడా అమ్మకాలు కనిపించాయి. ఇందులో డౌ, నాస్‌డాక్, ఎస్‌అండ్‌పీ ఫ్యూచర్లు కూడా బలహీనపడ్డాయి. సెన్సెక్స్ 130 పాయింట్లు ఉండగా, నిఫ్టీ 18350పాయింట్లు దాటింది.
అయితే జపాన్‌కు చెందిన నిక్కీ, కొరియాకు చెందిన కోస్పి సూచీలు మాత్రం పుంజుకున్నాయి. హాంగ్‌కాంగ్‌లోని హాంగ్‌సెంగ్ ఈరోజు మూసివేయబడింది. అంతకుముందు గురువారం బిఎస్‌ఇ సెన్సెక్స్ 99 పాయింట్లు లాభపడి 61,872 వద్ద ముగిసింది.