Mon. Dec 23rd, 2024
satyam-computers

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, హైదరాబాద్, జూన్ 21,2022: సత్యం కంప్యూటర్స్‌ మాజీ మేనేజ్‌మెంట్‌, డైరెక్టర్లపై దాఖలైన వ్యాజ్యా న్ని ఆరులోగా పరిష్క రించాలని సిటీ సివిల్‌ కోర్టును చీఫ్‌ జస్టిస్‌ సతీష్‌ చంద్రశర్మ, జస్టిస్‌ అభినంద్‌ కుమార్‌ షావలితో కూడిన హైకోర్టు డివిజన్‌ ​​బెంచ్‌ ఆదేశించింది. సత్యం కంప్యూటర్స్ (ప్రస్తుతం టెక్ మహీంద్రా) 2012లో తమ మోసపూరిత చర్యలకు నష్టపరిహారం కోరుతూ సత్యం కంప్యూటర్స్ మాజీ ఛైర్మన్ రామలింగ రాజు ఇతర మాజీ డైరెక్టర్లపై దావా వేసింది.

satyam-computers

ట్రయల్ కోర్టులో సత్యం కంప్యూటర్స్ కేసు10 సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉందని టెక్ మహీంద్రా న్యాయవాది వివేక్ రెడ్డి ధర్మాసనానికి తెలిపారు. ఈ కేసులో ఎటువంటి పురోగతి లేదని సత్యం కంప్యూటర్స్ చేసిన మోసపూరిత చర్యలకు సంబంధించిన క్రిమినల్ చర్యలు ముగిశాయని మాజీ చైర్మన్ రామ లింగరాజును దోషిగా నిర్ధారించినట్లు వివేక్ రెడ్డి తెలిపారు. ఆరు నెలల్లోగా కేసును పరిష్కరించాలని ట్రయల్ కోర్టును సీజే శర్మ ఆదేశించారు.

error: Content is protected !!