365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, జూలై 22,2022: ఇవ్వాళ ఉత్తర ఒరిస్సా , పరిసర ప్రాంతాల్లో ద్రోణి కొనసాగుతూ సగటు సముద్ర మట్టం నుంచి 5.8 కి.మీ ఎత్తుకి వెళ్లే కొలది నైరుతి దిశ వైపుకి వంపు తిరిగి ఉంది.మరొక ఉత్తర-దక్షిణ ద్రోణి ఈరోజు దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక నుంచి కొమరన్ ప్రదేశం వరకు సగటు సముద్ర మట్టం నుంచి 0.9 కి.మీ ఎత్తు వరకు కొనసాగుతుంది.
రాగల 3 రోజులకు వాతావరణ సూచన: (Weather Forecast): ఇవ్వాళ, రేపు తెలంగాణా రాష్ట్రంలో అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు, అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. రాగల మూడు రోజులపాటు తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సంచాలకులు నాగరత్న వెల్లడించారు.