Sun. Dec 22nd, 2024

365 తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జూలై 2,2024: ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థుల కోసం వీసాతో కలిసి ఐసీఐసీఐ బ్యాంకు కొత్తగా ‘స్టూడెంట్ సఫీరో ఫారెక్స్ కార్డు’ పేరిట ప్రీమియం ఫారెక్స్ ప్రీపెయిడ్ కార్డును ఆవిష్కరించింది. అడ్మిషన్ ఫీజు, కోర్సు సంబంధ ఫీజు, విద్యా సంబంధ ఖర్చులతో పాటు ఇతరత్రా ప్రయాణం, డైనింగ్, గ్రోసరీల్లాంటి ఖర్చులను కూడా నిర్వహించుకునేందుకు ఈ కార్డు ఇటు విద్యార్థులతో పాటు అటు తల్లిదండ్రులకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది.

అలాగే పలు ప్రయోజనాలను కూడా అందిస్తుంది. క్రాస్-కరెన్సీ మార్క్-అప్ చార్జీలు లేకుండా 15 కరెన్సీలను ఇందులో లోడ్ చేసుకోవచ్చు, లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. ఒకే కరెన్సీని లోడ్ చేసుకున్నా ప్రపంచవ్యాప్తంగా ప్రయాణించేందుకు వెసులుబాటు లభిస్తుంది. ఈ కార్డు ఇంటర్నేషనల్ లాంజ్ యాక్సెస్, ఉబెర్ ఓచర్లు వంటి రూ. 15,000 వరకు విలువ చేసే జాయినింగ్ ప్రయోజనాలు అందిస్తుంది. ఇది రెండు కార్డుల కిట్ రూపంలో లభిస్తుంది. ఒకవేళ ప్రైమరీ కార్డు పోయినా, రిప్లేస్‌మెంట్ కార్డును డిజిటల్‌గా యాక్టివేట్ చేసుకునే సదుపాయం ఉంటుంది. “ట్యూషన్ మరియు రోజువారీ ఖర్చుల చెల్లింపులకు, తల్లిదండ్రులు ఎక్కడినుంచైనా కార్డును డిజిటల్‌గా రీలోడ్ చేసే వీలుతో పాటు అదనంగా ప్రత్యేక ప్రయోజనాలు అందించేలా ఈ కార్డు విద్యార్థులకు మూడిందాల ప్రయోజనకరంగా ఉంటుంది” అని కార్డు ఆవిష్కరణ సందర్భంగా ఐసీఐసై బ్యాంక్ హెడ్ (పేమెంట్ సొల్యూషన్స్) శ్రీ నీరత్ ట్రల్షావాలా (Niraj Tralshawala) తెలిపారు.

“చదువును కొనసాగిస్తూనే, ట్యూషన్, ట్రావెల్, డైనింగ్, గ్రాసరీల్లాంటి వివిధ రకాల ఖర్చులను సౌకర్యవంతంగా నిర్వహించుకునేందుకు విద్యార్థులకు ఇది ఉపయోగపడగలదు. దీనికి అంతర్జాతీయంగా ఆమోదయోగ్యత ఉండేందుకు, లావాదేవీల నిర్వహణ సులభతరంగా, సురక్షితంగా ఉండేందుకు వీసా తోడ్పడగలదు” అని వీసా ఇండియా కంట్రీ మేనేజర్ శ్రీ సుజయ్ రైనా తెలిపారు. కార్డు కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఐసీఐసీఐ బ్యాంకు ఖాతాదారులు https://www.icicibank.com/personal-banking/cards/travel-card/student-sapphiro-forex-prepaid-card ను సందర్శించవచ్చు లేదా iMobile Pay లో: Cards & Forex > Forex Prepaid Cards > Apply Now ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

విద్య కోసం విదేశాలకు వెళ్తున్న విద్యార్థుల కోసం ఐసీఐసీఐ బ్యాంక్ స్టూడెంట్ ఫారెక్స్ కార్డు మరియు మల్టీకరెన్సీ ఫారెక్స్ కార్డును కూడా ఐసీఐసీఐ బ్యాంకు అందిస్తోంది. * ప్రయోజనాల రివార్డులకు సంబంధించి షరతులు, నియమాలు వర్తిస్తున్నాయి.

error: Content is protected !!