365తెలుగు డాట్ కామ్,ఆన్ లైన్ న్యూస్, అక్టోబర్ 4, 2020,బెంగళూరు: ప్రముఖ ఆన్ లైన్ క్రౌడ్ ఫండింగ్ సంస్థ మిలాప్ విజయవంతంగా పది సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ ప్లాట్ ఫామ్ ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలకు చెందిన ఆన్‌లైన్ నిధుల సేకరణదారులు110 కోట్ల రూపాయలు సమీకరించారు. సంవత్సరాల తరబడి పొదుపును వైద్య అత్యవసరాలు రోజులలోనే మింగేస్తాయి. కొన్నిసార్లు అది కూడా సరిపోదు. కానీ ప్రతి ఒక్కరూ తమ ప్రియమైనవారిని కాపాడుకునేందుకు ఉన్న అత్యుత్తమ అవకాశాలను గురించి అన్వేషిస్తూనే ఉంటారు. సరిగ్గా ఇటువంటి సమయంలోనే మిలాప్ లాంటి వేదికలు సహాయపడుతుంటాయని మిలాప్ సీఈవో మయూఖ్ చౌదరితెలిపారు.‘‘హైదరాబాద్ నుంచి పలు క్యాంపెయిన్‌ల ద్వారా వైద్య అవసరాల కోసం అత్యధిక మొత్తాన్ని సమీకరించారు. గత ఆరు నెలల్లో ఈ మొత్తాలు 170 రెట్లు వృద్ధి చెందాయని” ఆయన అన్నారు. ఆన్‌లైన్ క్రౌడ్‌ఫండింగ్ ద్వారా ప్రజలు తమ అవసరాలను స్నేహితులు, ప్రియమైన వారితో ఒక్క క్లిక్‌తో చేరుకోవడంతో పాటుగా విస్తరించిన నెట్‌వర్క్ నుంచి సైతం నిధులను సమీకరిస్తున్నారు. అంతేకాదు అపరిచితుల నుంచి కూడా వేగంగా, సురక్షితంగా, పారదర్శక విధానంలో నిధులను సమీకరిస్తున్నామని మయూఖ్ చౌదరి పేర్కొన్నారు. ప్రస్తుతం అధికంగా హెల్త్‌కేర్ క్రౌండ్‌ఫండింగ్ కోసం దీనిని వినియోగిస్తున్నారు.
2015లో ఈ క్రౌడ్ ఫండింగ్‌ను అధికంగా విద్యావసరాల కోసం వినియోగిస్తే, 2016లో అకస్మాత్తుగా ఐదు రెట్ల వృద్ధిని వైద్య , అత్యవసరాల కోసం వినియోగించడం ఒక్క సంవత్సరంలోనే నమోదుచేసింది. ప్రతి సంవత్సరం ఇతర కారణాల కోసం అంటే మహిళా సాధికారిత, పెంపుడు జంతువులు మరియు పశువుల కోసం వంటి వాటికి సైతం ఫండ్ రైజర్లను చేయడం పెరిగింది. అయినప్పటికీ, అత్యవసర వైద్య అవసరాల కోసం తోడ్పాటును ఇవ్వడం మాత్రం అత్యధికంగా ఉంది. మరీముఖ్యంగా దీర్ఘకాలిక , అత్యవసర చికిత్సలైనటువంటి క్యాన్సర్ కేర్, చిన్నారుల కోసం అవయవ మార్పిడి వంటి వాటికి ఎక్కువగా మిలాప్ క్రౌడ్ ఫండింగ్ తోడ్పడుతోంది.
గత కొద్ది సంవత్సరాలుగా, ఆన్‌లైన్ క్రౌడ్ ఫండింగ్‌కు అసాధారణ ప్రాచుర్యం కలుగుతుంది, కానీ ఇది సవినయ ఆరంభాన్ని ప్రారంభంలో చేసింది. నేడు అధికంగా హెల్త్‌కేర్ క్రౌండ్‌ఫండింగ్ కోసం దీనిని వినియోగిస్తున్నారు. 2015లో ఈ క్రౌడ్ ఫండింగ్‌ను అధికంగా విద్యావసరాల కోసం వినియోగిస్తే,2016లో అకస్మాత్తుగా ఐదు రెట్ల వృద్ధిని వైద్య మరియు అత్యవసరాల కోసం వినియోగించడం ఒక్క సంవత్సరంలోనే నమోదుచేసింది. ప్రతి సంవత్సరం ఇతర కారణాల కోసం అంటే మహిళా సాధికారిత, పెంపుడు జంతువులు మరియు పశువుల కోసం వంటి వాటికి సైతం ఫండ్ రైజర్లను చేయడం పెరిగింది. అయినప్పటికీ, అత్యవసర వైద్య అవసరాల కోసం తోడ్పాటును ఇవ్వడం మాత్రం అత్యధికంగా ఉంది. మరీముఖ్యంగా దీర్ఘకాలపు మరియు అనుకోని చికిత్సలైనటువంటి క్యాన్సర్ కేర్, చిన్నారుల కోసం అవయవ మార్పిడి వంటి వాటికి ఎక్కువగా తోడ్పడుతున్నారు.