365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,డిసెంబర్ 26,2024: ఇటీవల సినిమాల ట్రెండ్ మార్చేస్తూ న్యాయ వ్యవస్థ నేపథ్యంలో రూపొందిన అరుదైన కథాంశంతో ‘లీగల్లీ వీర్’ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వీర్ రెడ్డి, దయానంద్ రెడ్డి, ఢిల్లీ గణేశన్, గిరిధర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి రవి గోగుల దర్శకత్వం వహిస్తున్నారు. సిల్వర్ కాస్ట్ బ్యానర్‌పై శాంతమ్మ మలికిరెడ్డి నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 27న విడుదల కానుంది.
ప్రీరిలీజ్ ఈవెంట్ హైలైట్స్
హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో ఘనంగా నిర్వహించిన ఈ సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్‌లో చిత్రబృందం ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
హీరో వీర్ రెడ్డి మాట్లాడుతూ:
“సినీ నేపథ్యం లేని నాకు, కరోనాకాలంలో పాడ్‌కాస్ట్ చేయాలనే ఆలోచన వచ్చింది. అప్పుడు సినీ రంగంలో పరిచయాలు ఏర్పడ్డాయి. న్యాయవాదిగా ఉండటం వల్ల ఈ పాత్రను చేయడం సులభమైందని అనిపించింది. ఇప్పటివరకు మన దగ్గర పూర్తిస్థాయి లీగల్ థ్రిల్లర్‌లు రాలేదు. రియల్ కోర్టు డ్రామా ఎలా ఉంటుందో చూపించాలన్నదే మా లక్ష్యం.” అన్నారు.
దర్శకుడు రవి గోగుల మాట్లాడుతూ:
“ఇలాంటి అరుదైన సబ్జెక్ట్‌పై పని చేయడం గొప్ప అనుభవం. సినిమా వాస్తవికతతో కట్టిపడేస్తుంది. ప్రతి సీన్ మన చుట్టూ జరుగుతున్నట్టు ఉంటుంది. ప్రేక్షకులు మా సినిమాను ఆదరిస్తారని ఆశిస్తున్నాం.” అన్నారు.
నిర్మాత శాంతమ్మ మలికిరెడ్డి మాట్లాడుతూ:
“న్యాయవ్యవస్థపై ఒక విలక్షణమైన కథతో సినిమా తీస్తున్నాం. ప్రజాస్వామ్య వ్యవస్థలో లా కీలకమైనది. ఈ నెల 27న విడుదలవుతున్న ఈ చిత్రానికి మీ అందరి ఆశీర్వాదం కావాలి.” అన్నారు.
సాంకేతిక బృందం..
- బ్యానర్: సిల్వర్ కాస్ట్ క్రియేషన్స్
- నిర్మాతలు: మలికిరెడ్డి శాంతమ్మ
- దర్శకత్వం – స్క్రీన్‌ప్లే: రవి గోగుల
- సంగీతం: శంకర్ తమిరి
- సినిమాటోగ్రఫీ: జాక్సన్ జాన్సన్, అనూష్ గోరక్
- ఎడిటింగ్: ఎస్.బి. ఉద్ధవ్
- లిరిక్స్: వీరించి, శ్యామ్ కాసర్ల, రోల్రైడా
- కోరియోగ్రఫీ: ప్రేమ రక్షిత్ మాస్టర్, వల్లం కళాధర్
- ఫైట్స్: రామకృష్ణ
- VFX: మ్యాజిక్ B..