Mon. Dec 23rd, 2024
Legrand India launches Myrius Next Gen

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, ఫిబ్రవరి 17, 20201 : లిగ్రాండ్, ఇండియా, ఎలక్ట్రికల్, డిజిటల్ బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో గ్లోబల్ లీడర్,నేడు వైరింగ్ డివైసులలో నూతన శ్రేణి ‘మైరియస్ నెక్స్ట్ జెన్’  ప్రీమియమ్ ఉత్పాదన వర్గీకరణ లాంచ్ చేసింది. మైరియస్ నెక్స్ట్ జెన్ ద్వారా మోడరన్ టెక్నాలజీ విలువలు స్థాపించి, ప్రీమియమ్ సెగ్మంట్ స్థానంలో లిగ్రాండ్ స్థాయిని దృఢపరుస్తుందని ఆశించబడుతున్నది.ఈ ఉత్పాదన లక్ష్యం – రెసిడెన్సియల్,కమర్షియల్ సెగ్మంట్ కాగా,ఆర్కిటెక్ట్స్,  బిల్డర్స్, ఎలక్ట్రీషియన్స్, కన్సల్టంట్స్, కాంట్రాక్టర్స్, డెవలపర్స్, సిస్టమ్ ఇంటిగ్రేటర్స్,రీటైలర్స్ మీద దీని ఫోకస్ ఉంటుంది.లిగ్రాండ్ టీమ్, మన భారతీయ సంస్కృతి ,హెరిటేజ్ ప్రేరణతో ప్రత్యేకంగా క్యూరేట్ చేయబడి మోటిఫ్ కలెక్షన్ ప్లేట్లు డెవలప్ చేసింది. ఇండియాలోని దక్షిణ పశ్చిమ భాగంలోని  దట్టమైన, దుర్భేద్య అరణ్యాలలో దొరికే మిస్టీరియస్ సెప్పర్ స్పైస్ నుండి డార్క్ ఫేడ్ ప్లేట్లకు ప్రేరణ లభించింది. కేరళ, తమిళనాడులో పెప్పర్ ప్లాంటేషన్ ప్రారంభం అయిన తర్వాత, డార్క్ ఫేడ్ సాధారణ జనావళికి రుచి చూపించింది. ఇక్కడ ఐ.ఎమ్.డి టెక్నాలజీ ఉపయోగించబడింది, ఇది ఈ కేటగిరీలో మొదటిది కాబట్టి ఒక గొప్ప ఆవిష్కరణగా రూపొందింది. ఈ టెక్నాలజీతో, ఉత్పాదనలకు సునిశిత రూపం,మన్నిక అందుబాటులోకి వచ్చి, అత్యాధునిక గృహ అలంకరణ లోని ఇది లేటెస్ట్ స్టైల్ తో జతపడింది.

Legrand India launches Myrius Next Gen
Legrand India launches Myrius Next Gen

ఈ నూతన ఉత్పాదనల శ్రేణిని అభివృద్ధి చేయుటలో ఉపయోగించినది IoT ఇంటలిజెన్స్, దీనిలో వైర్లెస్ టెక్నాలజీ ఇమిడి ఉండి, దీనిని వాయిస్ కంట్రోల్, యాప్ కంట్రోల్ ద్వారా రిమోట్ రూపంలో (ఇంటి నుంచి బయట ఉన్నసమయంలో కూడా) కంట్రోల్ చేస్తుంది ,ఎలక్ట్రికల్ రూపం ద్వారా దీని వినియోగాన్ని మానిటర్ చేసి, అలర్ట్ చేయగలుగుతుంది. దీని ద్వారా ఈ బ్రాండ్ తమ కస్టమర్లకు సేవింగ్స్, సేఫ్టీ, కన్వీనియన్స్,కంట్రోల్ ,మనశ్శాతి కూడా నిశ్చితం చేస్తుంది. లిగ్రాండ్ ద్వారా ఎనేబుల్ చేయబడిన హోమ్/ ఎవే వైర్లెస్ మాస్టర్ స్విచ్ ద్వారా తమ వినియోగదారులకు అనేక సాధనాలను స్విచ్ ఆన్,స్విచ్ ఆఫ్ చేసే సౌకర్యం లభిస్తుంది. ధీనితో కేవలం ఒక స్విచ్ నొక్కి, లేదా మీ ఫోన్ లోని ఒక యాప్ ని ట్యాప్ చేసి గానీ, మీరు ఇంట్లో ఉన్నప్పుడు కూడా  ఇంటిలోని అన్ని లైట్స్, షటర్స్ లేదా సాకెట్స్ స్విచ్ ఆన్,స్విచ్ ఆఫ్ చేయవచ్చు. ఈ శ్రేణిలోని అన్ని ఉత్పాదనలు చక్కగా డిజైన్ చేయబడ్డాయి. వీటితో విడిభాగాలు కూడా జోడించదగినవిగా తయారైనవి, కాబట్టి ఇప్పుడు కస్టమర్లకు ఎలక్ట్రికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మార్చుటకు ఇబ్బంది పడవలసిన పని ఉండదు.

Legrand India launches Myrius Next Gen
Legrand India launches Myrius Next Gen

శ్రీ టోనీ బెర్లాండ్,సిఇఒ,మేనేజింగ్ డైరెక్టర్, లిగ్రాండ్ ఇండియా, “ మహామారి కారణంగా, 2020 సంవత్సరం ప్రపంచమంతటికి ఒక కష్టకాలం అయింది,ఇండియన్ ఎలక్ట్రికల్ బ్రాండ్స్ ఈ పరిస్థితికి భిన్నం కాదు. కానీ ఇంతటి కష్టమైన పరిస్థితిలో కూడా, మా కస్టమర్ల కొరకు డిజైనీరింగ్ ,టెక్నాలజీ మీద ఫోకస్ పెట్టిన వైరింగ్ డివైసుల ఒక నూతన శ్రేణిని లాంచ్ చేయాలని మేము నిర్ణయం తీసుకున్నాం. నూతన ఉత్పాదనల అభివృద్ధి అనేది మా గ్రోత్ ఇంజన్ అంతర్గత భాగం కాబట్టి, మేము ఆ ఫిలాసఫీని పాటించుటకు ప్లాన్ చేసాం. మా ప్రీమియమ్ ప్రాడక్ట్ వర్గీకరణకు, నూతన బ్రాండ్ – మైరియస్ నెక్స్ట్ జెన్ తో ఒక నూతన శ్రేణిని చేర్చుట మాకు చాలా ఆనందం కలుగుతున్నది ”అని అన్నారు. సమీర్ సక్సేనా, డైరెక్టర్ – మార్కెటింగ్, లిగ్రాండ్ ఇండియా, “కస్టమర్లు ఇన్నొవేషన్ హృదయభాగంలో ఉంటారని లిగ్రాండ్ దృఢ విశ్వాసం. కస్టమర్లు మా ప్రాధాన్యత అన్న విషయాన్ని మనసులో పెట్టుకుని,  మేము మైరియస్ నెక్స్ట్ జెన్ లాంచ్ కు నిర్ణయం తీసుకున్నాం. మా కస్టమర్ల ఫీడ్ బ్యాక్ మాకు ట్రెండ్స్ ,కస్టమర్ల ఎక్సపెక్టేషన్లు అర్థం చేసుకోవటానికి సహాయపడ్డాయి. లేటెస్ట్ IOT టెక్నాలజీ ద్వారా మా కస్టమర్లకు సౌకర్యం నిశ్చితం చేయటమే ఈ ఉత్పాదనల శ్రేణి వెనుక ఉన్న ఉద్దేశం. మా కస్టమర్లు అందరికి విశిష్టమైన అనుభూతి,ఎంపిక సౌకర్యం ఉండేలా నిశ్చితపర్చుటకు, మేము ఇండియన్ హెరిటేజ్ ,సమృద్ధి చెందిన సంస్కృతి,పరిపూర్ణ ప్రేరణతో మా మౌలిక కలెక్షన్ ను చాలా ప్రత్యేకంగా రూపొందించాం” అని  అన్నారు.

Legrand India launches Myrius Next Gen
Legrand India launches Myrius Next Gen

ముఖ్యంగా కోవిడ్ టైమ్స్ ను మనసులో పెట్టుకొని, కస్టమర్ల ఆరోగ్యం,హైజీన్ ప్రాధాన్యతతో ఈ బ్రాండ్ కాన్సెప్ట్ ఉండేలా శ్రద్ధ తీసుకొని, ఆ ప్రేరణతో దీనిని రూపొందించుట జరిగింది. సిల్వర్ ఐయాన్ శక్తి తో ఒక యాంటీ- బ్యాక్టీరియల్ ఫీచర్ ను లిగ్రాండ్ తయారు చేసింది. ఇది తరచుగా మనం తాకే స్విచ్చులు,ప్లేట్ల మీద కనిపించే బ్యాక్టీరియాకు ప్రతిరోధకంగా పనిచేస్తుంది.లిగ్రాండ్ 5.5 బిలియన్ యూరోల గ్లోబల్ టర్నోవరు తో  ప్రపంచంలో ఒక  ప్రముఖ స్థానం లోని ఎలక్ట్రికల్,డిజిటల్ బిల్డింగ్ సొల్యుషన్ అందించే కంపెనీ. ఇండియన్ మార్కెట్ లో ఈ కంపెనీ ప్రీమియమ్ వైరింగ్ సాధనాలు,అదే విధంగా ఎమ్.సి.బి పరికరాలు అగ్ర స్థానం ఆక్రమించుకుని ఉన్నాయి. ఆ సంస్థ యొక్క ఉత్పాదనల శ్రేణి విస్తృతంగా రెసిడెన్సియల్,కమర్షియల్ ఇండస్ట్రియల్,అతిథి సేవల పరిశ్రమలో ఎక్కువగా ఉపయోగించ బడుతుంది. లిగ్రాండ్ ఇండియా తమ స్మార్ట్ కనెక్టెడ్ హోమ్ ఆఫరింగ్స్ తో మరింత ముందుకు దూసుకు పోతున్నది. తమ స్మార్ట్ కనెక్టెడ్ ద్వారా IoT  రంగంలో ప్రవేశంతో, లిగ్రాండ్ మరింత వేగంగా అగ్రస్థానంలో ముందుకు దూసుకు పోతున్నది.

error: Content is protected !!