365తెలుగుడాట్కామ్,ఆన్లైన్న్యూస్,హైదరాబాద్,ఏప్రిల్10,2021:ఆర్థిక సేవల రంగంలో అగ్రగామి, సుప్రసిద్ధ ఫిన్‌టెక్ కంపెనీ లెండింగ్ కార్ట్ , ప్రభావవంతంగా మహిళా ఆధారిత ఎంఎస్‌ఎంఈలతో కలిసి పనిచేయడంతో పాటుగా విభిన్నమైన ఆర్థిక,ఋణ అవకాశాలను అందించడం ద్వారా వారి వ్యాపారాలను వ్యాప్తి చేసుకునేందుకు మరియు దేశంలో తరువాత దశ వృద్ధికి తోడ్పాటునందిస్తుంది. లెండింగ్ కార్ట్ ఇప్పుడు 15 మిలియన్‌యుఎస్ డాలర్లను డచ్ ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూట్ ఎఫ్‌ఎంఓ ఎంటర్‌ప్రిన్యూరియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ నుంచి సమీకరించడంతో పాటుగా మహిళా వ్యవస్థాపకులకు మద్దతునందిస్తుంది. అదే రీతిలో నూతన ఆర్థిక సంవత్సరంలో ఈ వేదికపై వారు చేరేందుకు సైతం తగిన ప్రోత్సాహం అందిస్తుంది. దేశవ్యాప్తంగా మహిళా వ్యవస్థాపకులకు తగినశక్తిని అందిచడం గురించి హర్షవర్ధన్ లునియా, సీఈవో అండ్ కో–ఫౌండర్, లెండింగ్ కార్ట్ మాట్లాడుతూ ‘‘ అభివృద్ధి పరంగా మహిళలెప్పుడూ ముందు వరుసలోనే నిలుస్తున్నారు. భారతీయ ఆర్థిక వ్యవస్థలో పలు విభాగాలలో ఆల్ రౌండర్లుగా వారు నిలువడంతో పాటుగా సృజనాత్మక పరిష్కారాలను వారు సమస్యలను పరిష్కరించడం కోసం తీసుకువస్తూనే, వ్యాపార మరియు సమాజ కోణంలో ప్రభావాన్నీ సృష్టిస్తున్నారు. లెండింగ్ కార్ట్ వద్ద మేము ఎల్లప్పుడూ ఈ వ్యాపారవేత్తల సామర్థ్యం విశ్వసిస్తుంటాం మరియు మా ప్రత్యేకమైన ఉత్పత్తులైనటువంటి మహిళల కోసం వర్కింగ్ క్యాపిటల్ లోన్ ను లెండింగ్ కార్ట్ ఎక్స్‌ల్‌ఆర్8, లెండింగ్ కార్ట్ 2జీటీహెచ్‌ఆర్ వంటి వేదికలు వారికి అనుకూలమైన మార్గాలుగా నిలుస్తున్నాయి. ఈ మహిళా వ్యాపారవేత్తల ప్రయాణంలో తోడ్పాటునందించడం పట్ల మేము గర్వంగా ఉన్నాము. మార్పుకు వారు నేతృత్వం వహిస్తుడటంతో పాటుగా ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఇండియా మారడంలో తోడ్పాటునూ అందిస్తున్నారు’’ అని అన్నారు.

ఇండియన్ అసోసియేషన్స్ కన్సోర్టియం వెల్లడించే దాని ప్రకారం భారతదేశంలో మొత్తం సూక్ష్మ, చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థలు(ఎంఎస్‌ఎంఈ)లో మహిళలకు సొంతమైన సంస్థలు దాదాపుగా 12% ఉంటున్నాయి. మహిళా వ్యాపారవేత్తలకు తగిన శక్తిని, ప్రేరణను అందించేందుకు లెండింగ్ కార్ట్ ముందుండటంతో పాటుగా దేశ వ్యాప్తంగా అత్యంత కీలకమైన ఈ విభాగానికి ఋణాలను విస్తరిస్తుంది.ఈ తరహా మహిళలు నేతృత్వం వహిస్తున్న వ్యాపార సంస్థలలో హైదరాబాద్ నుంచి కూడా ఉన్నాయి. అలాంటి సంస్ధలలో శ్రీమతి సరోజిని హోతా కు చెందిన వస్త్ర వ్యాపారం కూడా ఒకటి. ఆమె లెండింగ్ కార్ట్ నుంచి ఋణ సదుపాయం పొందారు. తొలుత కఠినమైన ప్రక్రియల కారణంగా అవసరమైన పేపర్ వర్క్‌ను అర్థం చేసుకోవడంలో ఆమె చాలా ఇబ్బంది పడ్డారు. లెండింగ్ కార్ట్ శ్రీమతి హోతాకు ఋణ వితరణ ప్రక్రియలో మార్గనిర్ధేశనం చేశారు. దీనిలో కనీస డాక్యుమెంటేషన్, కెవైసీని డిజిటల్‌గా పూర్తి చేయడం, ఒప్పందంపై ఈ –సంతకాలు వంటివి కూడా భాగంగా ఉన్నాయి.
కేవలం ఓ సంవత్సరం లోపుగానే, ఆమె తన వ్యాపారాన్ని పలు ప్రాంతాలకు విస్తరించడంతోపాటుగా పలు శాఖలనూ ఏర్పాటుచేశారు. ఆమె తన వస్త్ర వ్యాపారాన్ని నగరం వెలుపలకు కూడా విస్తరించేందుకు ప్రణాళిక చేశారు. ఈ క్రమంలోనే తన విస్తరణ ప్రణాళికల కోసం మరోమారు లెండింగ్ కార్ట్ నుంచి ఋణ సదుపాయం తీసుకోవాలని కోరుకుంటున్నారు.శ్రీమతి ఊర్మిళ ష్రివార్ధంకర్, హైదరాబాద్‌లో ఓ పెట్ స్టోర్ యజమానురాలు. ఆమెది కూడా స్ఫూర్తిదాయక గాథ. బ్యాంక్ నుంచి ఋణం పొందడం కోసం ఆమె చేసిన ప్రయత్నాలు పలు మార్లు విఫలం కావడంతో పాటుగా డాక్యుమెంటేషన్ ప్రక్రియ కూడా అత్యంత సవాల్‌తో కూడి ఉండేది. ఆ తరువాత, ఆమె లెండింగ్ కార్ట్ నుంచి ఋణం కోసం దరఖాస్తు చేసుకున్నారు. అక్కడ ఆమె వేగంగా ఋణం పొందడంతో పాటుగా బ్రాండ్ బిల్డింగ్ ,సోషల్ మీడియా ఇన్వెస్ట్‌మెంట్స్ ద్వారా తన వ్యాపారాన్నీ విస్తరించారు. కోవిడ్–19 అనంతర లాక్‌డౌన్ వేళ, దేశ ఆర్ధిక వ్యవస్థకు వెన్నుముకగా నిలిచే ఎంఎస్‌ఎంఈలు మహమ్మారి చేత తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఆరంభించిన నాటి నుంచి మరీ ముఖ్యంగా మహమ్మారి సమయంలో, ఋణ ప్రక్రియలు మరియు దాని ఆర్థిక ప్రయోజనాలు, సదుపాయాలు ద్వారా ఎంఎస్‌ఎంఈల మూలధన అవసరాలను తీర్చడంతో పాటుగా వ్యాపారవేత్తలతో భాగస్వామ్యం చేసుకుని భారతీయ ఎంఎస్‌ఎంఈ వ్యవస్థను శక్తివంతం చేయడానికి లెండింగ్ కార్ట్ కట్టుబడి ఉంది.