Fri. Nov 8th, 2024
Bank holidays

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, సెప్టెంబర్ 24, 2023: అక్టోబర్ 2023లో బ్యాంక్ సెలవుల జాబితా : మీరు బ్యాంకుకు సంబంధించిన ఏదైనా ముఖ్యమైన పనిని పూర్తి చేయాలనుకుంటున్నారా..?

బ్యాంకుకు సంబంధించిన మీ ముఖ్యమైన పనిని అక్టోబర్ నెలలో పూర్తి కావలసినట్లయితే అక్టోబర్ నెలలో బ్యాంకులు ఏ రోజుల్లోసెలవులు ఉన్నాయో తెలుసుకోవాలి. వచ్చే నెలలో బ్యాంక్ సెలవులు ఉన్నాయి.

అక్టోబర్ నెలలో మొత్తం16 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. ఈ సెలవులు మీ బ్యాంకింగ్ సంబంధిత పనిపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం, ప్రభుత్వ సెలవు దినాలలో అన్ని బ్యాంకులకు సెలవులు ఉంటాయి. రాష్ట్రాలను బట్టి కొన్ని ప్రాంతీయ సెలవులు కూడా ఉంటాయి. అక్టోబర్ నెలలో బ్యాంకులకు ఏ రోజుల్లో సెలవులు ఉన్నాయో తెలుసుకుందాం..

2 అక్టోబర్ 2023 – సోమవారం మహాత్మా గాంధీ జయంతి
14 అక్టోబర్ 2023 – శనివారం, మహాలయ
18 అక్టోబర్ 2023 – బుధవారం, కటి బిహు

21 అక్టోబర్ 2023 – శనివారం, దుర్గా పూజ (మహా సప్తమి)
23 అక్టోబర్ 2023 – సోమవారం, దసరా (మహానవమి)/ఆయుధ పూజ/దుర్గా పూజ/విజయ దశమి
24 అక్టోబర్ 2023 – మంగళవారం, దసరా/దసరా (విజయదశమి)/దుర్గాపూజ

25 అక్టోబర్ 2023 – బుధవారం, దుర్గా పూజ (దసైన్)
26 అక్టోబర్ 2023 – గురువారం, దుర్గా పూజ (దసాయి)/ప్రవేశ దినం
27 అక్టోబర్ 2023 – శుక్రవారం, దుర్గా పూజ (దసైన్)

Bank holidays

28 అక్టోబర్ 2023 – శనివారం, లక్ష్మీ పూజ
31 అక్టోబర్ 2023 – మంగళవారం, సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి.

ఈసారి అక్టోబర్ నెలలో మొత్తం 5 ఆదివారాలు వస్తున్నాయి. ఈ ఐదు ఆదివారాలు కూడా బ్యాంకులకు సెలవులు ఉంటాయి.

error: Content is protected !!