Sun. Dec 1st, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, నవంబర్ 27,2024: చెరువులపై కబ్జాలు చేస్తున్నారని స్థానికులు చేసిన ఫిర్యాదుల నేపథ్యంలో, హైడ్రా కమిషనర్ రంగనాథ్ బుధవారం క్షేత్ర స్థాయిలో పరిశీలన చేపట్టారు.

నిజంపేటలోని నిజాం తలాబ్ లేక్ (తురకచెరువు), మాదాపూర్ లోని మేడి కుంట చెరువు, యీ దులకుంట, నార్సింగ్ లోని నెక్నాంపూర్ చెరువు, తెల్లాపూర్లోని వనం చెరువు, చెల్లికుంట, మేళ్ళ చెరువులను సందర్శించారు. ఈ సందర్బంగా పలువురు స్థానికులు చెరువులపై కబ్జాలు జరుగుతున్నాయని ఫిర్యాదు చేశారు.

చేరువుల పునరుద్ధరణకు సంబంధించి వినతిపత్రాలు కమిషనర్ కి అందజేశారు. స్థానికులు చెరువుల చరిత్రను వివరించి, వాటి సుందరీకరణ పేరుతో కట్టలు నిర్మించడం, బఫర్ జోన్ ప్రాంతాలను కబ్జా చేయడం. gated communityల నుంచి మురుగు ప్రవహించడంపై ఆందోళన వ్యక్తం చేశారు.

వారు చెరువులు కబ్జా కాకుండా ఉండేలా చూస్తామని కమిషనర్ రంగనాథ్ స్థానికులకు హామీ ఇచ్చారు. అదేవిధంగా, చెరువుల పూర్తి వివరాలు సేకరించి కబ్జా నివారణ చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.

సమీక్ష నిర్వహించి, సమగ్ర చర్యలు తీసుకుంటామని స్థానికులను ఆశ్వాసించారు.

error: Content is protected !!