365తెలుగు డాట్ కామ్,ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, జూన్ 8,2021: రాష్ట్రంలోని కరోనా పరిస్థితులు, లాక్‌డౌన్ పై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్యక్షతన మంగళవారం సమావేశమైన మంత్రి వర్గం చర్చించింది. లాక్‌డౌన్‌ను మరో పదిరోజుల పాటు పొడిగించాలని మంత్రివర్గం నిర్ణయించింది. లాక్‌డౌన్ నిబంధనలు సడిలిస్తూ మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. ఉదయం 6 గంటల నుంచి ఒంటి గంట వరకు ఉన్న లాక్‌డౌన్ సడలింపును . సాయంత్రం 5గంటల వరకు పొడిగించాలని మంత్రి వర్గం నిర్ణయించింది. సాయంత్రం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6గంటల వరకు పూర్తి లాక్‌డౌన్ అమల్లో ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్ సమయాన్ని రాష్ట్ర ప్రభుత్వం సడలించినప్పటికీ కొవిడ్ ఉద్ధృతి కొనసాగుతోన్న కొన్ని ప్రాంతాల్లో తాజా సడలింపులు వర్తించవని ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రంలోని సత్తుపల్లి, మధిర, నల్గొండ, నాగార్జున సాగర్, దేవరకొండ, మునుగోడు, మిర్యాలగూడ నియోజకవర్గాల పరిధిలో ఇప్పుడు కొనసాగుతున్న ఆంక్షలను యథావిధిగా కొనసాగించాలని మంత్రివర్గం నిర్ణయించింది.

-ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సడలింపు.. కాగా ,సాయంత్రం 5గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు గంటపాటు వెసులుబాటు.
-సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కఠినంగా లాక్‌డౌన్ అమలు.