Mon. Dec 23rd, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,ఫిబ్రవరి 10,2022:హైపర్‌ లోకల్‌ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ లోకల్‌, తమ యాప్‌పై ఓ అధ్యయనం నిర్వహించడం ద్వారా ఓమైక్రాన్‌ వేరియంట్‌ ప్రభావం దక్షిణాది రాష్ట్రాలలో ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేసింది. తమిళనాడు, కర్నాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్‌,తెలంగాణా రాష్ట్రాలలో టియర్‌ 2, టియర్‌ 3 జిల్లాలకు చెందిన 17,500 మంది వినియోగదారులు ఈ అధ్యయనంలో పాల్గొన్నారు. ఈ సర్వేలో 22–40 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తులు పాల్గొన్నారు.తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషలలో ఈ అధ్యయనం చేశారు.

సంవత్సరారంభంలోనే పెరిగిన కోవిడ్‌ కేసులతో, దక్షిణ భారతదేశంలో కరోనా వైరస్‌ అత్యంత వేగంగా వ్యాప్తి చెందింది.ఈ అధ్యయనం వెల్లడించే దాని ప్రకారం 60% మంది స్పందనదారులు తమ కుటుంబంలో కనీసం ఇద్దరు వ్యక్తులు ఒమైక్రాన్‌ లక్షణాలతో తీవ్ర ఇబ్బందులు పడ్డారని తెలిపారు. వీరిలోనూ 25% మంది తమ కుటుంబ సభ్యులంతా కూడా దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి లక్షణాలతో గత నెల ఇబ్బంది పడ్డారని తెలిపారు.ఈ మూడోవేవ్‌లో ప్రజల బాధ్యతాయుతమైన ప్రవర్తన కనిపించింది. దాదాపు 76% మంది స్పందనదారులు 2–3 రోజుల పాటు లక్షణాలు ఉంటే డాక్టర్‌ను సంప్రదించాలని భావించామని వెల్లడించారు.

కేవలం 13% మంది మాత్రమే ఓ వారం పాటు వేచి చూసిన తరువాత డాక్టర్‌ను సంప్రదించామన్నారు. ప్రభుత్వానికి తగిన మద్దతునందించడంలో దక్షిణ
భారత వాసుల నిబద్ధతను సైతం ఈ అధ్యయనం వెల్లడించింది. ఇక్కడ విధించిన ఆంక్షలకు ప్రజలు కట్టుబడ్డారు.దాదాపు 82% మంది సామూహిక కార్యక్రమాలకు దూరంగా ఉండటం, తమ ప్రయాణప్రణాళికలను రద్దు చేసుకోవడం జరిగింది. ఈ అధ్యయనం వెల్లడించే దాని ప్రకారం సెల్ఫ్‌ టెస్టింగ్‌ కోవిడ్‌ కిట్ల పట్ల టియర్‌2, టియర్‌ 3 నగరాలలో అవగాహన పెరిగింది. అంతేకాదు 23% మంది స్పందనదారులు తాము వాటిని వినియోగించామన్నారు.

error: Content is protected !!