365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఆగస్టు 2,2024: సోషల్ మీడియా స్టార్ శ్రీకాంత్ రెడ్డి ఆసం హీరోగా వచ్చిన లారీ చాప్టర్ -1 సినిమా ఈరోజు విడుదలైంది. స్టంట్స్, సంగీతం, దర్శకత్వం వహించి నిర్మించిన చిత్రం ‘లారి చాప్టర్-1’ ఇది. అంతేకాదు కథ కూడా ఆయన సొంతంగా రాసుకున్నారు.
చెన్నై లొయోల కాలేజీలో డైరెక్షన్ కోర్స్ చేసి హైదరాబాద్ వచ్చి ఎన్నో చిత్రాల్లో పలు శాఖలలో పని చేసి తనకంటూ ఓ ప్రత్యేక ముద్రను సొంతం చేసుకున్నారు. తర్వాత యూట్యూబ్‌లో తన వీడియోలతో ఫేమస్ అయిన శ్రీకాంత్ రెడ్డి.. ఇప్పుడు ‘లారి చాప్టర్-1’ అనే మూవీతో సిల్వర్ స్క్రీన్ కు పరిచయం అయ్యారు.
ఈ చిత్రంలో హీరోయిన్‌గా చంద్రశిఖ @Chandrashikha , రాఖీ సింగ్ (Rakhi Singh) ప్రధాన పాత్రలో నటించారు. తాజాగా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, బెంగాళీ భాషల్లో విడుదలైంది. యూట్యూబ్ స్టార్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీకాంత్ రెడ్డి తన మొదటి సినిమాతోనే ప్రేక్షకులను అలరించగలిగాడా? ఇవాల్టీ రివ్యూలో తెలుసుకుందాం..
కథ..
చిత్తూరు జిల్లాలోని రంగపట్నంలో వీధి రౌడీ హర్షవర్ధన్ ఆలియస్ హంటర్ (శ్రీకాంత్ రెడ్డి ఆసం) తన కుటుంబాన్ని పోషించడానికి చిన్న చిన్న గొడవల్లో పడిపోతూ ఉంటాడు. ఈ క్రమంలో ఓ గొడవలో జైలుకి వెళ్లి తిరిగి వచ్చి ఒక అమ్మాయితో ప్రేమలో పడుతాడు. గొడవలు మానేసి మెకానిక్ షాప్ పెట్టి పని చేస్తూ ఉంటాడు.
ఇదే క్రమంలో మైనింగ్ అధిపతి ప్రతాప్ ముఖ్యమంత్రి అవ్వాలని, దానికి కావాల్సిన డబ్బు కోసం ఇల్లీగల్ మైనింగ్ దంత చేస్తూ ఉంటాడు. తాను మైనింగ్ లో కనుగొన్న యురేనియంని ముంబైకి సంబంధించిన ఒక పెద్ద విలన్ కి అమ్మటం కోసం 3000 కోట్ల యురేనియం సరుకును డెలివరీ చేయటం కోసం ప్రతాప్ హంటర్‌ని కలుస్తాడు.
హీరో తన చెల్లి పెళ్ళికి చేయడానికి డబ్బులు అవసరమవ్వడంతో డబ్బుల కోసం లారీని డెలివరీ చేస్తానని వెళతాడు. లారీని డ్రైవింగ్ చేస్తూ డెలివరీ చేసే క్రమంలో వేర్వేరు రాష్ట్రాల విలన్స్ లారీ డెలివరీని ఎలా ఆపారు? చివరికి డెలివర్ చేశాడా? లేదా?విలన్స్ అందరు రాష్ట్రాలకి సంబందించి ఎందుకు హీరో వెంట పడ్డారు? అనేది తెలుసుకోవాలంటే లారి చాప్టర్ – 1 సినిమాని థియేటర్‌లలో చూడాల్సిందే.
నటీనటుల ప్రతిభ..
ఈ సినిమాకు తన ప్రతిభను, తన కష్టాన్ని నమ్ముకుని హర్షవర్ధన్ ఆలియస్ హంటర్ పాత్రలో నటించిన శ్రీకాంత్ రెడ్డి ఆసం ఆక్సిజన్ అని చెప్పొచ్చు. యూట్యూబ్ స్టార్‌గా తన అనుభవంతో ఈ సినిమాను మన ముందు పర్‌ఫెక్టుగా నిలబెట్టడంలో విజయం సాధించాడనే చెప్పాలి. నటించడంతో పాటు సినిమా నిర్మాణం చేయడంలో అనుభవం చూపించారు.
దర్శకత్వం, నటన, సంగీతం, ఎడిటింగ్, స్టంట్‌లన్నీ తనే నిర్వహించి మల్టీటాలెంట్ చూపించాడు. హీరోగానూ శ్రీకాంత్ రెడ్డి నటన, డైలాగ్స్ బాగున్నాయి, ఫైట్స్ ఇరగదీశాడు. యాక్షన్ సీన్లలో అదరగొట్టాడు. తొలి సినిమాతో తన ప్రతిభను నిరూపించుకుని టాలీవుడ్‌కు బెస్ట్ హీరో దొరికాడని నిరూపించు కున్నాడు. హీరోయిన్ చంద్రశిఖ క్యూట్‌గా కనిపించింది. లవ్ ఆండ్ రొమాన్స్ సీన్లలో యూత్‌ను ఎట్రాక్ట్ చేసింది. ఇక రాకీ సింగ్, చంద్రశిఖ శ్రీవాస్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
మల్టీ టాలెంటెడ్ స్టార్..
మల్టీ టాలెంటెడ్ స్టార్: శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వం, నిర్మాణం, నటన, సంగీతం, ఎడిటింగ్, స్టంట్స్ అన్నీ తానే చేయడం ఈ చిత్రం ప్రత్యేకత.
యాక్షన్ ఎంటర్టైనర్: చిత్రం ప్రధానంగా యాక్షన్ ఎంటర్టైనర్. శ్రీకాంత్ రెడ్డి చేసిన స్టంట్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
తొలి సినిమాకు మంచి ప్రతిస్పందన: తన తొలి సినిమాతోనే శ్రీకాంత్ రెడ్డి హిట్ టాక్ అందుకున్నాడు. భాషలు: తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ, బెంగాళీ భాషల్లో ఈ చిత్రం విడుదలైంది.
స్క్రీన్‌ప్లే..
సినిమాటోగ్రఫీ అందించిన తాడిపత్రి నాగార్జున పనితీరు బాగుంది. మ్యూజిక్ ట్రాక్ సినిమాను మరో మెట్టు ఎక్కించింది, లిరికల్ వీడియోస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఎడిటింగ్ వర్క్ బాగుంది. 3 గంటల రన్ అవర్ ఉన్నా కూడా టెంపో కొనసాగింపు ప్రతి సెకన్ మజా వచ్చేలా ఉంది. టెంప్లేట్ పాతగా అనిపించినా, కథలో కొత్తదనం ఉంది. దర్శకత్వం కొత్తగా కనిపిస్తుంది. స్క్రీన్‌ప్లే కూడా సరికొత్తగా ఉంది.
అనాలిసిస్..
సోషల్ మీడియాలో కోట్లాది మంది ఫాలోవర్స్ సొంతం చేసుకున్న యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డికి ఇది తొలి సినిమా అయినప్పటికీ ప్రతి పార్టులో ఎంతో పరిణతి, అనుభవం చూపించాడు. ‘లారీ – చాప్టర్ 1’ యాక్షన్, డ్రామా, సస్పెన్స్‌తో నిండి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తుంది. లవ్ ఆండ్ రొమాన్స్ సీన్లు యూత్‌ను తెగ ఆకట్టుకుంటాయి.
ఇక తండ్రి-కొడుకు సెంటిమెంట్, అన్నా-చెల్లి సెంటిమెంట్ సీన్లు ఈ సినిమాలో బాగా పండాయి. శ్రీకాంత్ రెడ్డి ఆసం ఒక యూట్యూబర్ నుంచి సినిమా రంగానికి తన ప్రయాణం ఈ తరం వాళ్లకి స్ఫూర్తిదాయకం. మొత్తానికి ఈ సినిమా ప్రేక్షకులకు మంచి అనుభవం కలిగిస్తుంది. థియేటర్‌కు వెళ్లి చూడాల్సిన సినిమా ఇది.
ఆడియెన్స్ స్పందన..
ప్రేక్షకులు కూడా ఈ చిత్రంపై సానుకూలంగా స్పందిస్తున్నారు. శ్రీకాంత్ రెడ్డి కష్టాన్ని, ప్రతిభను అభినందిస్తున్నారు. యూట్యూబ్ నుంచి సినిమా రంగానికి వచ్చిన తమకు ఇష్టమైన స్టార్‌ను తెరపై చూడటం పట్ల చాలామంది ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేశారు.
365తెలుగు డాట్ కామ్ రేటింగ్: 3.75 / 5..
ఇదికూడా చదవండి: బిఎస్ఎన్ఎల్ సరికొత్త రికార్డ్.. 30 రోజుల్లో రెండు లక్షల కనెక్షన్లు..
ఇదికూడా చదవండి: మీకు ఇష్టమైన మొబైల్ నంబర్‌ను పొందవచ్చు.. BSNL సరికొత్త సదుపాయం..
Also read:Please give me something to eat, Sarabjot relishes food at India House after winning bronze
ఇదికూడా చదవండి: ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు..
ఇదికూడా చదవండి: వనస్థలిపురంలో జరిగిన సంఘటన పార్టీలతో యువత జీవితం అల్లకల్లోలం.