365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,ఫిబ్రవరి 13, 2024:నేటి టీనేజ్ కి ప్రేమ ఒక మాయలా కనిపిస్తుందని ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షురాలు డా.హిప్నో పద్మా కమలాకర్, డా.పద్మజ, డా.పి.స్వరూపా రాణి అన్నారు.
ఫిబ్రవరి 14 నా ప్రేమికుల రోజు సందర్భంగా మంగళవారం డా.హిప్నో కమలాకర్స్ మైండ్ అండ్ పర్సనాలిటీ కేర్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. వారు మాట్లాడుతూ ఆ మాయలో పడి చాలా మంది తనువు చాలిస్తున్నారని వాపోయారు.
ఈ నేల మీద మన ఉనికి సార్థకం కావాలంటే మనం ఎవరో ఒకరిని ప్రేమించాలన్నారు. చేతిలో చెయ్యివేసి, బరువైన క్షణాల్ని పంచుకునేందుకు జీవితంలో ఏదో ఒక చోట ఎవరో ఒకరు ఉండాలని తెలిపారు.
ఆ ప్రేమ స్పర్శ లేనిదే జీవితం లేదన్నారు.-1-4-3, హార్టు సింబల్, ప్రేమ, కాదల్, ఇష్క్, మొహోబత్, ఇవ్వన్నీ టీనేజి పిల్ల లను ఉరూతలూగిస్తూంటాయన్నారు. యువతను దౌడు తీయించేలా చేసేది ప్రణయమేనన్నారు.
ఈ ప్రేమకు నిర్వచనం ఏమిటో ఇంతవరకూ ఎవరూ కనిపెట్టలేని ఒక శాస్త్రీయ సత్యమన్నారు. యుక్తవయసులోకి వచ్చినవారికి ఒళ్ళు జలధరింపచేసే పదం ఒకటే…”ప్రేమ”అన్నారు. టీనేజీ కుర్రాళ్ళు ఎపుడూ ఈ పదం చుట్టూర పరిభ్రమిస్తుంటారన్నారు.
క్రష్ భావాలు పెద్ద వాళ్ళల్లోకూడా అల్లుకుంటూ సాగే సంబంధంగా పరిగణించవచ్చునని తెలిపారు . ఈరోజుల్లో ప్రేమ వ్యామోహం లో మోసగించడం, మోసపోవడం ఎక్కువయ్యాయిని ఆవేదన వ్యక్తం చేశారు.
చాలా మంది యువతులు తమ ప్రేమ కన్నా రేపటి కెరీర్ వ్యవహారాలకే ప్రాధాన్యత ఇవ్వడం ఆనందించే విషయమన్నారు. ప్రేమనేది ఎదుటివారు బాగుండాలని కోరుకునే విధంగా ఉండాలన్నారు.
ప్రతి ఒక్కరిలో హాస్యం, ఓపెన్ మైండ్, భద్రత భావం ఉంటే ప్రేమ ఎప్పుడూ అద్భుతమైనదేనన్నారు.
ప్రేమ ఎప్పుడూ కొత్తగానే ఉంటుందన్నారు.
డా.హిప్నో పద్మా కమలాకర్
కౌన్సెలింగ్ సైకో థెరపీస్ట్ హిప్నో థెరపీస్ట్
@ 9390044031