365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,న్యూఢిల్లీ, జూలై 25, 2025: భారతీయ కుటుంబాల్లో పెంపుడు జంతువులకు ప్రాణం కంటే ఎక్కువ ప్రేమ లభిస్తుంది. వాటిని అచ్చం తమ కుటుంబ సభ్యుల్లాగే చూసుకుంటారు. తాము తినేదే వాటికీ పెడతారు. కానీ, ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది.
ఈ ప్రేమలో పోషకాహార అవసరాలపై సరైన అవగాహన లోపిస్తుంది. ఈ కీలకమైన సమస్యను పరిష్కరించేందుకు, పెంపుడు జంతువుల ఉత్పత్తులు, సేవల రంగంలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన మార్స్ సంస్థ ఒక వినూత్న ప్రచారాన్ని ప్రారంభించింది. అదే “కుటుంబంలా ప్రేమించండి… పిల్లులు, కుక్కల్లాగే ఆహారమివ్వండి”!
కొత్త అవగాహనా చిత్రాలు..
పెడిగ్రీ (Pedigree) అండ్ విస్కాస్ (Whiskas) బ్రాండ్‌ల కోసం, ముఖ్యంగా పిల్లులు, కుక్కల పోషకాహార అవసరాలపై అవగాహన కల్పించేలా మార్స్ ఈ ప్రచార చిత్రాలను రూపొందించింది. వీటిలోని సందేశం చాలా సులభం, కానీ ఎంతో అవసరం: “అవి మీ కుటుంబసభ్యులే కావచ్చు. కానీ వాటి పోషకాహార అవసరాలు మాత్రం వేరు!”

పెడిగ్రీ బ్రాండ్ చిత్రంలో, ఒక యజమాని తమ కుక్కలు ఆహారం విషయంలో తమ సహజ అలవాట్లతో ఎలా స్పందిస్తాయో తెలుసుకుంటారు. విస్కాస్ బ్రాండ్ చిత్రంలో, పిల్లులను కుటుంబ సభ్యుల్లాగే భావిస్తున్నా, వాటి పోషకాహార అవసరాలు పూర్తిగా విభిన్నమైనవని తెలుసుకోవడం ద్వారా యజమాని, పిల్లి మధ్య అనుబంధాన్ని ప్రదర్శిస్తారు. ఈ ప్రచార చిత్రాలను BBDO ఇండియా, BBDO గుయెరెరో రూపొందించాయి.
సమస్య ఎక్కడ? పశువైద్యుల సర్వేలో వెల్లడైన నిజాలు:
భారతీయ పశువైద్యులతో చేసిన ఒక సర్వే ఈ ప్రచారానికి ప్రధాన ఆధారం. ఈ అధ్యయనం ప్రకారం, ఇంట్లో వండిన ఆహారం వల్ల పెంపుడు జంతువులకు తగిన పోషకాలు అందడం లేదని, వాటి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోందని తేలింది.
ఎక్కువ మంది పశువైద్యులు సలహా ఇస్తున్నది ఏంటంటే – పెంపుడు జంతువులకు పూర్తి సమతుల, ప్యాకేజ్డ్ పెట్ ఫుడ్ పెట్టడమే ఉత్తమం. ఇలా చేయడం వల్ల వాటి అరుగుదల, శక్తి, చర్మ ఆరోగ్యం వంటివి మెరుగుపడుతున్నాయని వారు వివరించారు.
పరిశోధనలో ప్రధానాంశాలు..
ప్రతి 10 పెంపుడు జంతువుల్లో 9కి సరైన పోషకాహారం లేదు.
91% పశువైద్యులు: తగిన క్యాలరీలు, పూర్తి పోషకాలు అందాలంటే ప్యాకేజ్డ్ పెట్ ఫుడ్ మంచిది.
88% పశువైద్యులు: ఇంట్లో వండిన ఆహారం వాటికి తగినంత పోషకాలు అందించలేదు.
86% పశువైద్యులు: మానవ ఆహారం పెట్టడం వల్ల పెంపుడు జంతువుల్లో పోషకాల అసమతుల్యత ఏర్పడుతుంది.
79% మంది: యజమానులకు అవగాహన లేదు కానీ నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నారు.
“మీరు తినేది పెట్టడం ఆపండి”: పశువైద్యుల ఆందోళన
69% పశువైద్యులు: భారతీయులు పశువైద్యుల సలహాలను నిర్లక్ష్యం చేసి, ఇంట్లో వండిన ఆహార పదార్థాలను పెడుతున్నారు.
65% పశువైద్యులు: ప్యాకేజ్డ్ పెట్ ఫుడ్ పెట్టడం వల్ల పెంపుడు జంతువుల ఆరోగ్యం కాపాడుకోవచ్చు.
తేడా కనిపిస్తుంది: ప్యాకేజ్డ్ పెట్ ఫుడ్‌తో ప్రయోజనాలు
70% మంది: పెంపుడు జంతువుల బరువు తగినంతే ఉంటోంది.
66% మంది: పెంపుడు జంతువుల శక్తి పెరిగింది.
61% మంది: పెంపుడు జంతువుల అరుగుదల సమస్యలు లేవు.

ఈ సందర్భంగా బెంగళూరుకు చెందిన సీనియర్ పశువైద్యుడు, చిన్న జంతువుల కన్సల్టెంట్ డాక్టర్ ఉమేష్ కల్లహళ్లి మాట్లాడుతూ, “పెంపుడు జంతువులను సంరక్షించకపోవడం కాదు,
కానీ వాటి పోషకాల అవసరాలను గుర్తించకపోవడం వల్ల వచ్చే సమస్యలకు మేము తరచు చికిత్సలు చేస్తున్నాం. ఇంట్లో వండిన ఆహారం ఎంత బాగున్నా, అది పెంపుడు జంతువులకు కావాల్సిన పోషకాలు అందించదు.
నిపుణులైన పశువైద్య న్యూట్రిషనిస్టు రూపొందించిన ఆహారం మాత్రమే వాటికి అవసరం. అవగాహన లేని ప్రేమ వల్ల నీరసం, రోగనిరోధక శక్తి లోపించడం, చర్మ సమస్యలు, అరుగుదల సమస్యలు వస్తున్నాయి. మార్స్ చేస్తున్న ప్రచారాలు భారతదేశం లాంటి దేశంలో చాలా అవసరం” అని అన్నారు.
మార్స్ పెట్‌కేర్ ఇండియా ఎండీ సలిల్ మూర్తి మాట్లాడుతూ, “భారతీయులు పెంపుడు జంతువులను చూసే తీరు మారింది. అవి కుటుంబంలో భాగమయ్యాయి. కానీ, ఈ ప్రేమ వల్ల వాటి పోషకాల విషయంలో వెనకడుగు పడుతోంది.
యజమానులు సెంటిమెంటుతో పెడుతున్నారు తప్ప సైన్స్ ఆధారంగా పెట్టడం లేదు. ఈ రెండింటినీ కలిపి, వాటికి తగిన ఆహారం ఇచ్చేలా మా ప్రచారం యజమానులకు సాయం చేస్తుంది” అని వివరించారు.
మార్స్ పెట్‌కేర్ ఇండియా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ ఆయేషా హుడా మాట్లాడుతూ, “భారతీయుల్లో 90% మంది ఇంట్లో వండిన ఆహారమే పెంపుడు జంతువులకు పెడుతున్నారు. పెంపుడు జంతువులు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండేందుకు కావాల్సిన పోషకాలు అందులో ఉండవని వారికి తెలియదు.
భావోద్వేగాలు కాకుండా సైన్స్ ప్రకారం మారాల్సిన సమయం ఇది. 90 సంవత్సరాల అనుభవం ఉన్న మార్స్, పెడిగ్రీ, విస్కాస్ బ్రాండ్లు సమతుల, సంపూర్ణ పోషకాహారం ఎలా ఇవ్వాలో చెబుతున్నాయి” అన్నారు.
ప్రచారం ఎక్కడెక్కడ..?
ఈ ప్రచారం పెట్ స్టోర్లు, ఈకామర్స్ ప్లాట్‌ఫామ్‌లు, సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు, పశువైద్యశాలలు, రీటైల్ దుకాణాలు, మార్స్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌లలో కనిపిస్తుంది. పెంపుడు జంతువుల అవసరాలకు తగినట్లు, అవి ఆరోగ్యంగా ఉండేందుకు కావల్సిందే వాటికి పెట్టేలా యజమానులను ఇది ఆహ్వానిస్తుంది.
పెడిగ్రీ, విస్కాస్ బ్రాండ్లు కుక్కలు, పిల్లుల విభిన్న అవసరాలకు తగినట్లు సమతుల పోషకాహారాలను అందిస్తున్నాయి. వాల్‌థామ్ పెట్‌కేర్ సైన్స్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన నిపుణులు రూపొందించిన ఈ ఆహారంతో పెంపుడు జంతువులకు రోజు సరైన పోషకాహారం లభిస్తుంది.