365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, సెప్టెంబర్ 7,2025 : చంద్రగ్రహణం నేపథ్యంలో, గ్రహణ ప్రభావం నుండి బయటపడటానికి రాశుల వారీగా కొన్ని ప్రత్యేక మంత్రాలను పఠించడం మంచిదని ఆధ్యాత్మిక నిపుణులు సూచిస్తున్నారు. ఈ మంత్రాలను గ్రహణం సమయంలో 108 సార్లు జపించడం వల్ల గ్రహణ దోషాలు తొలగి, శుభ ఫలితాలు కలుగుతాయని చెబుతున్నారు.

రాశుల వారీగా పరిహార మంత్రాలు..

మేషం (Aries): ఈ రాశివారు “ఓం శరవణ భవ నమః” అనే మంత్రాన్ని జపించడం వల్ల మానసిక ఇబ్బందుల నుండి విముక్తి లభిస్తుంది.

వృషభం (Taurus): “ఓం శ్రీ మహా లక్ష్మయై నమః” అనే మంత్రాన్ని పారాయణం చేయడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు తొలగిపోతాయి.

మిథునం (Gemini): “ఓం నమో భగవతే వాసుదేవాయ” అనే మంత్రాన్ని జపించడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది.

కర్కాటకం (Cancer): ఈ రాశివారు “ఓం సోమాయ నమః” అనే మంత్రాన్ని పఠిస్తే కుటుంబ సంబంధాలలో అనుకూలత లభిస్తుంది.

సింహం (Leo): “ఓం సూర్యాయ నమః” అనే మంత్రాన్ని జపించడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

కన్య (Virgo): “ఓం శ్రీ ధన్వంతరాయ నమః” అనే మంత్ర పఠనం ఆరోగ్య సంరక్షణకు సహాయపడుతుంది.

తుల (Libra): “ఓం నమః శివాయ” అనే మంత్రాన్ని జపించడం వల్ల మానసిక ఒత్తిడి నివారణ జరుగుతుంది.

వృశ్చికం (Scorpio): “ఓం కాళికాయై నమః” అనే మంత్ర పారాయణం అన్ని సమస్యల నుండి పరిహారం చూపుతుంది.

ధనుస్సు (Sagittarius): ఈ రాశివారు “ఓం గురవే నమః” అనే మంత్రాన్ని పఠిస్తే గురు గ్రహ అనుగ్రహం లభిస్తుంది.

మకరం (Capricorn): “ఓం శనీశ్వరాయ నమః” అనే మంత్రాన్ని జపించడం ద్వారా గ్రహ సంబంధిత సమస్యల నుండి విముక్తి కలుగుతుంది.

కుంభం (Aquarius): “ఓం నమః శివాయ నమః” అనే మంత్ర పఠనం చంద్రగ్రహణ ప్రభావం నుండి ఉపశమనం ఇస్తుంది.

మీనం (Pisces): ఈ రాశివారు “ఓం దత్తాత్రేయ నమః” అనే మంత్రాన్ని జపించడం వల్ల అశాంతి నుండి విముక్తి లభిస్తుంది.

ఈ మంత్రాలను గ్రహణం సమయంలో శ్రద్ధతో జపించడం వల్ల ప్రతికూల ప్రభావాలు తగ్గి, శుభ ఫలితాలు పొందవచ్చని పండితులు చెబుతున్నారు.