M-stock_365

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, ఏప్రిల్ 13, 2023: అంతర్జాతీయ ఆర్థిక సేవల గ్రూప్ మిరే ఎసెట్ తమ ఆన్‌లైన్‌ రిటైల్ స్టాక్ బ్రోకింగ్ ప్లాట్‌ఫామ్ ఎం.స్టాక్ ప్రారంభించి ఏడాది పూర్త‌యింది. ఇందులో 1.8 లక్షల మంది పెయిడ్ యూజర్లు ఉన్నారు.

రూ.999 వన్ టైమ్ ఫీజుతో లభించే ‘జీరో బ్రోకరేజ్ ఇన్ ప్రొడక్ట్స్ ఫర్ లైఫ్’ ధర ఎం.స్టాక్ వృద్ధికి దోహ‌దం చేసింది. యాక్టివ్‌ క్లయింట్ రేషియో 71శాతం, 8.5 కోట్లకు పైగా ట్రేడ్లు, ఒక సంవత్సరంలో 71 లక్షలకు పైగా యాప్ డౌన్‌లోడ్‌ల‌ను బట్టి ట్రేడింగ్ ఆడియ‌న్స్‌ లో ఎం.స్టాక్‌కు పెరుగుతున్న ప్రజాదరణ తెలుస్తుంది.

M-stock_365

రూ.180 కోట్లకు పైగా మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ (ఇమార్జిన్) బుక్‌సైజ్ ఉన్న‌ట్లు ఎం.స్టాక్ తెలిపింది. కేవలం 9 నెలల క్రితం ప్రారంభించిన ఈమార్జిన్.. 80% వరకు నిధులను అందిస్తుంది.

ఇది సంవత్సరానికి 6.99%.. పరిశ్రమలో అతి తక్కువ వడ్డీ రేటుతో ప్రారంభమవుతుంది. తమ 1.8 లక్షల మంది పెయిడ్ యూజర్లలో 50 శాతం మంది మిలీనియల్స్ అని ఎం.స్టాక్ పేర్కొంది.

మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, గుజరాత్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలు టాప్ మార్కెట్లుగా ఉండటంతో, 80 శాతానికి పైగా కస్టమర్లు ఆయా రాష్ట్రాల్లోని ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు చెందినవారే.

బ్రోకరేజీ ఫీజు లేకుండా ట్రేడింగ్ వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించే ఉద్దేశంతో, వచ్చే 24 నెలల్లో తమ ఫ్లాగ్‌షిప్ బ్రోకరేజ్ ప్లాన్ (జీరో బ్రోకరేజ్ ఫర్ లైఫ్ @ రూ .999)లో అదనంగా 10 లక్షల మంది వినియోగదారులను చేర్చాలని కంపెనీ భావిస్తోంది.

M-stock_365

“రూ.100 కోట్ల టాప్ లైన్ ను దాటి, అదే స‌మ‌యంలో బ్రేక్ ఈవెన్ (లాభ‌న‌ష్టాలు లేని స్థితి)కి కూడా చేరాల‌న్న‌ది కంపెనీ ప్ర‌ణాళిక‌. ఈ సంద‌ర్భంగా మిరే అసెట్ క్యాపిటల్ మార్కెట్స్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్, చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అరుణ్ చౌదరి మాట్లాడుతూ..“మాపై నమ్మకం ఉంచి ఈ వృద్ధి ప్రయాణంలో ముందుకు సాగినందుకు మా వినియోగదారులందరికీ మేము చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము” అని అన్నారు.

“సాంకేతిక ఆవిష్కరణ, డిజిటల్ పరివర్తనతో అగ్ర‌స్థానానికి వెళ్లే ఎం.స్టాక్ కోసం స్టాక్ బ్రోకింగ్ పరిశ్రమలో తదుపరి దశ వృద్ధి గురించి మేము చాలా ఉత్సాహంగా ఉన్నాము. ఆర్థిక సేవల్లో మిరే అసెట్‌కు ఉన్న‌ 25కు పైగా సంవత్సరాల అంత‌ర్జాతీయ నైపుణ్యంతో, మేము చాలా తక్కువ సమయంలో లాభాల బాట‌లో వెళ్ల‌గ‌ల‌మ‌ని నమ్ముతున్నాము” అని చెప్పారు.